కామారెడ్డి జిల్లా సదాశివనగర్, తాడ్వాయి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కనిపించకపోవడంతో మంత్రి ముందు మాజీ ఎమ్మెల్యే అనుచరులు నిరసన తెలిపారు.
ఇది పార్టీ కార్యక్రమం కాదని, ప్రభుత్వ కార్యక్రమమని మంత్రి ఎమ్మెల్యే అనుచరులను సముదాయించారు. స్వయంగా తానే ఫోన్ చేసి రవీందర్ రెడ్డితో మాట్లాడానని చెప్పారు. కార్యక్రమం తర్వాత మీతో మాట్లాడతానని మాజీ ఎమ్మెల్యే వర్గాన్ని సముదాయించదాంతో అనుచరులు వేదిక ముందు నుంచి వెనుదిరిగారు