26.7 C
Hyderabad
April 27, 2024 07: 30 AM
Slider తెలంగాణ

కనీస మద్దతు ధరకు వరి కొనుగోలు చేస్తాం

kamalakar

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సిఎం కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, రైతు బంధు వంటి పథకాలతో బీడు భూములు సైతం సాగులోకి  వచ్చాయని అన్నారు. ఫలితంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి కానుందన్నారు.  రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో పౌరసరఫరాల సంస్థ 40 లక్షల మెట్రిక టన్నులు కొనుగోలు చేయగా, ఈ ఏడాది 55 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గురువారం నాడు బిసి కమిషన్‌ కార్యాలయంలో గంగుల కమలాకర్‌ పౌరసరఫరాల, బిసి సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రెండు శాఖల ద్వారా బడుగు బలహీనవర్గాలకు సేవచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఆపద మ్రొక్కుల స్వామికి విశేష అభిషేక, అర్చనలు

Satyam NEWS

డబ్బుకోసం పిల్లలను అమ్మేస్తున్నారు

Murali Krishna

తెలంగాణకు ఆక్సిజన్, వ్యాక్సిన్ అదనపు కోటా విడుదల

Satyam NEWS

Leave a Comment