38.2 C
Hyderabad
April 29, 2024 20: 17 PM
Slider మెదక్

ఏడుపాయల వన దేవతకు పట్టువస్త్రాల సమర్పణ

#edupayalajatara

మెదక్ జిల్లా లోని ఏడుపాయల వన దుర్గామాత కు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి హరిష్ రావు పట్టువస్త్రాలు సమర్పించారు. మహా శివరాత్రి జాతర ఉత్సవాలను నేడు ఆయన ప్రారంభించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జడ్పి చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు మంత్రి హరిశ్ రావుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయల కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని ఆయన తెలిపారు. మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ సందర్బంగా టూరిజం కోసం రూ 1500 కేటాయించామని, ఏడుపాయల కు 100 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి అన్నారు.

ఈ నిధులలో100 కోట్ల తో ఫౌంటెన్స్, క్వార్ట్జ్ లు ఇతర అభివృద్ధి పనులు చేపడతామని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సింగూర్ కు లింక్ చేయడం వల్ల ఏడుపాయలలో నీళ్లు ఎప్పుడు ఉంటాయని మంత్రి వెల్లడించారు. కాళేశ్వరం ప్రారంభించిన్నప్పుడు  పనులు కానేకావు అని హేళన చేశారని ఇప్పుడు మల్లన్నసాగర్  అంటే జల ప్రవాహిని అయిందని మంత్రి హరిశ్ తెలిపారు.

Related posts

జర్నలిస్ట్ హబీబ్ ఖాన్ కుటుంబానికి ఆర్థిక సాయం

Satyam NEWS

బోనాల వైభోగం

Satyam NEWS

పర్యాటక రంగం అభివృద్ధిలో గైడ్స్ పాత్ర ముఖ్యమైనది

Satyam NEWS

Leave a Comment