30.7 C
Hyderabad
April 29, 2024 05: 42 AM
Slider హైదరాబాద్

నల్లకుంట డివిజన్ కు మంత్రి కేటీఆర్ వరాలు

#MinisterKTR

హైదరాబాద్ లోని నల్లకుంట ప్రాంతంలోని నాలా లను ఆనుకుని వున్న నివాసితుల భద్రత కోసం రిటర్నింగ్ వాల్  నిర్మించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అంగీకరించారని నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ తెలిపారు. నేడు శ్రీదేవి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు.

భారీ వర్షంతో ముంపుకి గురైన నల్లకుంట డివిజన్ లోని వివిధ ప్రాంతాల గురించి ఆమె మంత్రికి వివరించారు. నాలాని ఆనుకుని వున్న కొన్ని ఇల్లు కూలిపోయిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆ నాలకి రిటర్నింగ్ వాల్ (ప్రొటక్షన్ వాల్ ) నిర్మించాలని కోరారు. అలాగే లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు వెళ్లే పైపు లైన్స్ కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.

మంత్రి తక్షణమే స్పందించారు. ఈ మేరకు మునిసిపల్ కమిషనర్ కు ఆదేశాలిస్తూ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం, వర్షపు నీరు వెళ్లే పైప్ లైన్స్ కోసం ప్రతిపాదనలు తయారు చేసి,  పనులు ప్రారంభించాలని మంత్రి కోరారు.

Related posts

వృద్ధ దంపతులకు సహాయం చేసిన Rti24 news

Satyam NEWS

గాడ్ ఇన్ లాక్ డౌన్: ఒంటిమిట్ట లో రథోత్సవ పూజలు

Satyam NEWS

భారీ వర్షం నీట మునిగిన పంట పొలాలు

Satyam NEWS

Leave a Comment