33.7 C
Hyderabad
April 29, 2024 02: 27 AM
Slider నిజామాబాద్

పండగలా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

#MP BB Patil

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పులపాలక ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం నుండే ఆయా మండలాల్లో కేక్ కట్ చేసి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

నియోజకవర్గంలోని నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్ ,జుక్కల్ ,మద్నూర్, బిచ్కుంద మండలాల్లో  జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండేలు కలిసి ఈ సందర్భంగా జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే హోమియోకేర్ ఇమ్యూనిటీ బూస్టర్ కిట్ల ను తన సొంత ఖర్చుతో ఎంపీ బీబీ పాటిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

ఉదయం నుండి ఈ మందుల పంపిణీ  కొనసాగి చివరగా బిచ్కుంద మండల కేంద్రంలో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం ఎంపీ చేయడం ఎంతో గొప్ప విశేషమని అన్నారు. ఆయన పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్కరికీ ఈ మందులు చేరే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారని అన్నారు. 

నియోజకవర్గం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఎంపి

ఎంపి బీబీ పాటిల్ కృషి వల్లనే సంగారెడ్డి నుండి నాందేడ్ వరకు నాలుగు వరుసల రహదారుల పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గుర్తుచేశారు. అనంతరం రాష్ట్ర మార్క్ ఫెడ్ అధ్యక్షులు మార గంగారెడ్డి మాట్లాడుతూ కరోనా కాలంలో రైతులకు టీఆర్ఎస్ సర్కార్ అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.

అన్ని రంగాలు కరోనా దెబ్బకి కుదేలైనప్పటికీ ప్రతి రైతు నుండి అన్ని రకాల పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న ఘనత కెసిఆర్ దే నని ఆయన అన్నారు. అనంతరం ఎంపి బిబి పాటిల్ మాట్లాడుతూ  నియోజకవర్గ ప్రాంత ప్రజల అభివృద్ధే తనకు ముఖ్యమని అందుకు అనుగుణంగా వారి ఆరోగ్యాన్ని  దృష్టిలో ఉంచుకుని తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టానన్నారు.

మంత్రి కెటిఆర్  మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు మాజీ జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు బిచ్కుందా ఎంపిపి అశోక్ పటేల్, మద్నూర్ ఎంపిపి లక్ష్మీబాయి ,జుక్కల్, ఎంపిపి యశోదా నీలుపటేల్, పెద్దకొడప్గల్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి,మద్నూర్ జడ్పీటీసీ అనిత పాల్గొన్నారు.

ఇంకా, బిచుకుంద జడ్పీటీసీ భారతి రాజు,నిజాంసాగర్ ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి,పిట్ల౦ ఎంపిపి కవిత విజయ్, బిచ్కుంద రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజ్ పటేల్ తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి సొసైటి చైర్మన్ బాలాజీతో పాటు అయా  మండలాల సర్పంచులు ఎంపీటీసీలు సొసైటీ చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొన్నారు.

Related posts

తీన్మార్ మల్లన్నను కలిసిన ములుగు జిల్లా సభ్యుడు శ్రీనివాస్

Satyam NEWS

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తాం

Bhavani

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే దేనికి సంకేతం?

Satyam NEWS

Leave a Comment