36.2 C
Hyderabad
April 27, 2024 22: 45 PM
Slider ముఖ్యంశాలు

దొంగ సర్టిఫికెట్లతో మోసం చేసిన మంత్రి మల్లారెడ్డి కాలేజీ

#MallareddyCollege

విద్యాబుద్ధులు నేర్పి మంచి ఇంజనీర్లను తయారు చేయాల్సిన మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ దొంగ సర్టిఫికెట్లతో నేష‌న‌ల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేష‌న్ కౌన్సిల్ (న్యాక్‌) నే మోసం చేయాలని చూసింది.

అయితే మంత్రి మల్లారెడ్డికి చెందిన ఈ కాలేజీ చేసిన మోసాన్ని గుర్తించిన న్యాక్ ఇంజనీరింగ్ కాలేజీపై 5 సంవత్సరాలు బ్యాన్ విధించింది.

ఈ విషయాన్ని న్యాక్ అధికారిక వెబ్‌సెట్‌ ద్వారా ప్రకటించింది. వివరాల్లోకెళితే హైదరాబాద్ శివారులోని కొంపల్లిలోని మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 2018లో B++ గ్రేడ్‌ను న్యాక్ కేటాయించింది.

అయితే ఇంకా మంచి గ్రేస్ సాధించాలనే ఉద్దేశ్యంతో కాలేజీ యాజమాన్యం న్యాక్‌ను మోసం చేసే ప్రయత్నిం చేసింది. న్యాక్ బెంగళూర్‌కు సెల్ఫ్ స్టడీ రిపోర్ట్‌లో నకిలీ డాక్యూమెంట్లను పంపించారు.

సెల్ప్ స్టడీ రిపోర్టులో నకిలీ డాక్యుమెంట్లు జతచేసి పంపించడంతో బాటు భెల్, యాష్, ఏయిర్ టెల్ కంపెనీలకు చెందిన నకిలీ లెటర్ హెడ్స్, స్టాంప్స్ తో మోసం చేశారని తేల్చారు.

మోసానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో చర్యలకు ఉపక్రమించారు. మల్లారెడ్డి కాలేజీ ఆప్ ఇంజనీరింగ్ పై ఐదు సంవత్సరాల నిషేధం విధిస్తూ అధికారిక వెబ్ సైట్ లో న్యాక్ పొందుపర్చింది.

Related posts

హామీ ఇచ్చి ఐదేళ్లయినా అమలు చేయరేం సారూ?

Satyam NEWS

ఎస్పీఎఫ్ పోలీస్ ఉద్యోగులను జోనల్ ఉద్యోగులుగా గుర్తించాలి

Satyam NEWS

ఆదర్శం: విద్యార్ధుల్ని దత్తత తీసుకున్న తెలుగుదేశం నేతలు

Satyam NEWS

Leave a Comment