37.2 C
Hyderabad
May 2, 2024 11: 43 AM
Slider ప్రత్యేకం

ఆదర్శం: విద్యార్ధుల్ని దత్తత తీసుకున్న తెలుగుదేశం నేతలు

#ashokgajapatiraju

అశోక్ బంగ్లాలో టీడీపీ జాతీయ అధ్య‌క్షుని  72 వ జ‌న్మ‌దిన వేడుక‌లు…!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 72 వ‌ జన్మదిన  వేడుకలు విజ‌య‌న‌గ‌రంలో  పార్టీ కార్యాలయమైన అశోక్ గారి బంగ్లాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా డెఫ్ అండ్ డంబ్ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులతో కేక్ కట్ చేయించారు..కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు.

ఇక పార్టీ సేవా కార్య‌క్ర‌మాలలో భాగంగా విజయనగరం పేర్లవారి వీధిలో గల డెఫ్ అండ్ డంబ్ పాఠశాల విద్యార్థులను ఒక ఏడాది పాటు  దత్తత తీసుకోను నిమిత్తం 54 వేలు… పాఠశాల ఉపాధ్యాయులకు అశోక్ గజపతి రాజు త‌న  చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. అనంత‌రం కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ…త‌న‌ను శ్రీకృష్ణ జ‌న్మ‌స్థానానికి చేర్పించేందుకు అధికార వైఎస్ఆర్సీపీ చూస్తోంద‌ని  ఆరోపించారు.

నేను చేసిన త‌ప్పేంట‌ని..? నాడు ఎన్టీర్ స్థాపించిన టీడీపీలో ఉండ‌ట‌మే త‌ప్పా..? లేక ఎన్టీఆర్ అనంత‌రం…పార్టీ బాద్య‌త‌ల‌ను త‌న భుజ‌స్కందాల‌పై వేసుకుని…మూడుసార్లు సీఎం అయిన చంద్ర‌బాబు నాయుడు గారి ఆధ్వ‌ర్యంలో  నిజాయితీగా ప‌ని చేస్తున్నందుకా…అంటూ అశోక గ‌జ‌ప‌తిరాజు ప్ర‌శ్నించారు.

ఈ కార్యక్ర‌మంలో మాజీ మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ ప్ర‌సాదుల క‌న‌క‌మ‌హ‌ల‌క్ష్మి, ఐవీపీ రాజు,విజ్జ‌పు ప్ర‌సాద్,క‌న‌క‌ల ముర‌ళీమోహ‌న్  ల‌తో పాటు పార్టీ నేత‌లు పాల్గొన్నారు. ఇక పార్టీ జాతీయ అధ్య‌క్షుని పుట్టిన రోజు సంద‌ర్బంగా…పార్టీ ప‌రంగా ఎన‌మిది మందినేత‌లు… ఒక్కో విద్యార్దిని ఏడాది పాటు పోషించేందుకు సిద్ద‌మ‌య్యారు. వారిలో…

దత్తత తీసుకోను నిమిత్తం విరాళం ఇచ్చిన వారు :

1) పూసపాటి అశోక్ గజపతి రాజు  (ఒక విద్యార్థిని సం. పాటు)

2) ప్రసాదుల రామకృష్ణ ,  ప్రసాదుల కనక మహాలక్ష్మి  (ఒక విద్యార్థిని సం. పాటు) 

3) బొద్దుల నర్సింగరావు  (వారి తండ్రి గురునాయుడు గారి జ్ఞాపకార్ధం) (ఒక విద్యార్థిని సం. పాటు)

4) కంది మురళి నాయుడు (ఒక విద్యార్థిని సం. పాటు)

5) ఎస్.కె. ఎం. బాషా, (ఒక విద్యార్థిని సం. పాటు)

6) అనురాధ బేగమ్ (ఒక విద్యార్థిని సం. పాటు)

7) కోరాడ వెంకటరావు (ఒక విద్యార్థిని సం. పాటు)

8) విజయనగరం మండల పార్టీ తరపున (ఇద్దరి విద్యార్థులను)  దత్తత తీసుకోవడం జరిగింది.

Related posts

కోవిడ్ 19 సహాయానికి చిన్నారుల పెద్ద మనసు

Satyam NEWS

భారత ఇస్రో టీంకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు

Bhavani

ఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక జాబితా విడుదల

Satyam NEWS

Leave a Comment