28.7 C
Hyderabad
April 28, 2024 10: 01 AM
Slider ఆదిలాబాద్

భారీ వర్షాల కారణంగా రైతులు అధైర్య పడవద్దు

#joguramanna

ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద బాధిత గ్రామాలలో ఎమ్మెల్యే జోగురామన్న విస్తృతంగా పర్యటించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుగాట్, జండా గూడ గ్రామాలలోని పరిస్థితులను ఎమ్మెల్య్ జోగు రామన్న కాలినడకన తిరుగుతూ సమీక్షించారు.  గ్రామస్తులతో కలిసి అక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకుంటున్నారు.

పొంగిన వాగులతో పాటు గిరిజన గర్ల్స్ హాస్టల్ ను ఎమ్మెల్యే జోగు రామన్న సందర్శించి విద్యార్థులతో కలిసి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీవో ఫోన్ సమాచారం అందించి ప్రమాదం పొంచి ఉందని వెంటనే విద్యార్థినులను అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్ లో 60 మంది మహిళ విద్యార్థులను ప్రత్యేక  వాహనం ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్ లో వసతి సౌకర్యం కల్పించారు.

వారికి కావాల్సిన సౌకర్యాల పట్ల వార్డెన్ కు సూచించారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే ఉన్నత అధికారులతో కలిసి పలు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ గ్రామాల్లోని యువకులు వర్షాభావ పరిస్థితుల్లో సేవ చేసేందుకు ముందు ఉండాలన్నారు.. అలాగే పంట పొలాల విషయంలో రైతులు అధైర్యపడవద్దుని ఎమ్మెల్యే సూచించారు.

ఇండ్లు నష్టపోయిన వారికి కూడా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. నష్టపోయిన పంట పొలాలను సర్వే చేయించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు… టిఆర్ఎస్ కార్యకర్తలు సైతం గ్రామాలలో సేవలందిస్తూ ముందు ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం తరఫున వరద బాధితులకు తక్షణమే  రేషన్ సరుకులతో పాటు ఆహారాన్ని అందించాలని సూచించారు.

అధిక వర్షాలతో ఆదిలాబాద్ రైతాంగం మరియు ఇళ్లల్లో నీరు చేరిన బాధితులు ఆధార పడవద్దని ఎమ్మెల్యే సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఒక ఫోన్ కాల్ సమాచారం  అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఎట్టి పరిస్థితిలో అజాగ్రత్తగా ఉండకూడదని  ఎమ్మెల్యే పేర్కొన్నారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, వైస్ ఎంపీపీ గండ్ర రమేష్, డైరెక్టర్ పరమేశ్వర్, టిఆర్ఎస్ నాయకులు జగదీష్ స్థానిక సర్పంచులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

అంతేగా అంతేగా:సెట్స్ పైకి వెళ్లనున్న అసురన్ రీమేక్

Satyam NEWS

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

Bhavani

మానవత్వం చాటుకున్న ఎం.టి.ఓ. స్పర్జన్ రాజ్

Satyam NEWS

Leave a Comment