39.2 C
Hyderabad
April 28, 2024 13: 27 PM
Slider ఖమ్మం

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

#jay Kumar

గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని సమానంగా అందిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం

రఘునాథపాలెం మండలంలోని రూ.20 లక్షలతో చేరువుకొమ్ము తండా, రూ.20 లక్షలతో పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామ పంచాయతీ భావన నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

భవనాలు రానున్న మూడు నెలల్లో పూర్తి చేసి పరిపాలన ఇక్కడి నుండి ప్రారంభం కావాలని మంత్రి పువ్వాడ ఆదేశించారు.

దేశానికి పల్లెలే పట్టుకొమ్మలన్న మహాత్ముడి కలలను సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం రాజీ లేకుండా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

తెలంగాణాలో గతంలో 8,670 గ్రామ పంచాయతీలు ఉండేవి.. పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్‌ గారు వాటిని 12,751కి పెంచారని 2,800 తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దినట్లు వివరించారు.

దేశంలో ఉత్తమ పంచాయతీలుగా ఎన్నిక కాబడిన ఎక్కువ పంచాయతీలు మన రాష్ట్రం నుంచే ఎన్నికైనట్లు వివరించారు.
సీఎం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు.

తండాలను, హ్యాభిటేషన్ లు గా ఉన్న వాటిని గ్రామాలుగా చేసుకుని నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ది మనమే చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో సమస్యలపై సర్పంచులు దృష్టి సారించి, గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవవన్నారు. గ్రామాల్లో సంక్షేమ పథకం లబ్దిపొందని గడపలేదన్నారు.

Related posts

10 గ్రేడింగ్ పాయింట్స్ సాధిస్తే రూ.10,000 బహుమతి

Satyam NEWS

64 కళలూ పండిన మాయాబజార్ కు 64 ఏళ్లు నిండాయి!

Satyam NEWS

అనితా రెడ్డి కి తెలంగాణ రాష్ట్ర బెస్ట్ లీడర్ అవార్డు

Bhavani

Leave a Comment