38.2 C
Hyderabad
April 29, 2024 11: 58 AM
Slider విజయనగరం

ఇప్పుడు ఎన్నిక‌లు లేవు..! మీరు పిలిచారా లేదు..?మ‌రెందుకు వ‌చ్చామ‌నుకుంటున్నారు..!

డివిజ‌న్ వాసుల‌తో డిప్యూటీ స్పీక‌ర్,స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట మంతి….!.!

“కొళాయి…..క‌రెంట్ స‌రిగ్గా ఉండ‌టం లేదు సారూ. ఎమ్మెల్యేల‌కు 32 డివిజ‌న్ వాసుల ఫిర్యాదు…!”
ఇది విజ‌య‌న‌గ‌రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద ఉన్న తోట‌పాలెం…32 డివిజ‌న్ లోఉంటున్న వాసులు ఆరోప‌ణ‌.”ఇప్పుడు ఎన్నిక‌లు లేవు..! మీరు పిలిచారా లేదు..?మ‌రెందుకు వ‌చ్చామ‌నుకుంటున్నారు..”
ఇదీ డిప్యూటీ స్పీక‌ర్ స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి త‌న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలోభాగంగా న‌గ‌రంలోని 32 వ డివిజ‌న్ లో స్థానికులతో చేసిన మాటామంతి.

గ‌డ‌చిన కొద్ది రోజుల నుంచీ పార్టీ ఆదేశాల‌తో రాష్ట్ర మంత‌టా..అధికార పార్టీ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం అంటూ మూడేళ్ల‌ల‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన పనులు…ప్రస్తుతం ప్ర‌జ‌ల‌ను అనుభ‌సిస్తున్న క‌ష్ట సుఖాల‌ను స్వ‌యంగా ప‌ర్య‌టించి తెలుసుకోవాల‌ని ఆదశించింది.

దీంతో ఓ వైపు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస‌రావు,మ‌రోవైపు స్థానిక ఎమ్మెల్య కోల‌గ‌ట్ల‌వీర‌భ‌ద్ర‌స్వామిలు ప‌ర్య‌టిస్తున్నారు. అందులోభాగంగా న‌గ‌రంలోని 32న డివిజ‌న్ లో తోట‌పాలెంసెంట్ర‌ల్ బ్యాంక్ వ‌ద్ద ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల ప‌ర్య‌టించారు. తొలుగు బొత్స గురునాయుడు కాలేజీ వ‌ద్ద కారులో వ‌చ్చిన ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌ను.. అక్క‌డ‌నుంచీ డివిజ‌న్ వాసులైన రెడ్డి గురుమూర్తి, కార్పొరేట‌ర్ లు పార్టీ నేత‌లంతా సెంట్ర‌ల్ బ్యాంక్ నుంచీ ప్ర‌తీ ఇంటికి తీసుకెళ్లారు.

అక్క‌డే ఓఇంటి మ‌ధ్య లో బోరు వేసి ఉండ‌టం చూసిన ఎమ్మెల్యే…ఏంటీ ప‌రిస్తితి అడి ఎంఈ దిలీప్ ను అడిగారు. అప్పుడే ఆ ప‌క్కింటి వాళ్లు…కుళాయి నీరు రావ‌డం లేదు…క‌రెంట్ కూడా పోతోంద‌ని ఫిర్యాదు చేసారు .ఆ వెంట‌నే ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల క‌లుగ‌జేసుకుని..”ఆగండ‌మ్మా…ఇక్క‌డ‌కున‌న్ను మీరు పిలిచారా,..? లేక నేనే వ‌చ్చానా …అస‌లు ఈ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం గురించి మీకు తెలుసా.?” అంటూ ప్ర‌శ్రించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం …అధికారులు చేసిన ప‌నుల‌ను తెలుసుకునేందుకే ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోంద‌న్నారు.

ఇక డివిజ‌న్ వాసులు చెప్పిన ఫిర్యాదును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌..త‌క్షణ ఎంఈ దిలీప్ ను పిలిచి…ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుక్కోండ‌ని ఆదేశించారు. అక్కడ నుంచీ రామాల‌యం వ‌ర‌కు వెళ్లి…డివిజన్ మొత్తంలో స‌మ‌స్య‌ల‌ను గుర్తించి..వాటి ప‌రిష్కారం కొర‌కు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ కార్యక్ర‌మంలో మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ రేవితి, రెడ్డి గురుమూర్తి…పార్టీ నేత‌లు, డివిజ‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.

ఎం. భరత్ కుమార్, సత్యం న్యూస్. నెట్, విజయనగరం

Related posts

రాజకీయ నేపథ్యంలో వస్తున్న సర్కారువారి పాట

Satyam NEWS

యాక్ష‌న్ హీరో విశాల్‌, ఆర్యల భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఎనిమీ`

Satyam NEWS

టీటీడీ చైర్మన్ గా మళ్లీ వై వి సుబ్బారెడ్డి నియామకం

Satyam NEWS

Leave a Comment