38.2 C
Hyderabad
April 28, 2024 19: 29 PM
Slider కృష్ణ

పోలీసుల పై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి అనుచిత వ్యాఖ్యలు

#pardhasaradhi

పోలీసుల పై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి అనుచిత వ్యాఖ్యలు అధికార పార్టీ నాయకుల కోసం పోలీసులు అణిగి మణిగి ఒంగి పని చేస్తున్నా వారు సంతృప్తి చెందడం లేదు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టి అణచివేస్తున్న పోలీసు వ్యవస్థను అధికార పార్టీ నాయకులు అణచివేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటివి చాలా సంఘటనలు జరగగా మొన్న మంత్రి అప్పలరాజు ఒక పోలీసు అధికారిని బెదిరించి దుర్భాషలాడిన విషయం తెలిసిందే. వైసిపి ఎమ్మెల్యే పార్థసారథి పోలీసుల ను బ్రోకర్లతో పోల్చిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఉయ్యురూ ఎస్సై పై కోర్టులో కేసు పెట్టండి…అంటూ ఆయన తన కార్యకర్తలకు చెబుతున్న వీడియో బయటకు రావడంతో పోలీసుల ప్రతిష్ట మరింత దిగజారి పోయింది. గొడవలు పడితే స్టేషన్ లో కొట్టే హక్కు ఎవరిచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కార్యకర్తలను రెచ్చగొడితే మీరు ఉద్యోగాలు చేయలేరంటూ వ్యాఖ్య…. చేశారు. ఎమ్మెల్యే వీడియో వైరల్ అవుతున్నది.

Related posts

‘యశోద’లో యాక్షన్ రియలిస్టిక్‌గా ఉంటుంది

Bhavani

అంగరంగ వైభవంగా జేడ్పీ చైర్మన్ బిడ్డ..నిశ్చితార్థం..

Satyam NEWS

దళితులకు మూడెకరాలు భూమి కేటాయింపులో మోసం చేస్తున్న కేసీఆర్‌

Satyam NEWS

Leave a Comment