28.7 C
Hyderabad
April 28, 2024 05: 49 AM
Slider నల్గొండ

సంఘీభావ నిధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

#SheetalRoshapathi

దేశ రాజధాని ఢిల్లీలో వ్యవసాయ చట్టాలని రద్దు చేసేదాకా ఢిల్లీ  వదిలేది లేదని గత 25 రోజుల నుండి ఆందోళన చేస్తున్న వారికి CITU ఆధ్వర్యంలో సంఘీభావ నిధి వసూలు కి ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు మంచిగా స్పందించారని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షు శీతల రోషపతి అన్నారు.

ఇప్పటికే 29 మందిని బలిగొన్న ఆరు ఇంకెంత మందిని బలి కుంటారు అని బిజెపి ప్రభుత్వాన్ని రోషపతి ప్రశ్నించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో   సి ఐ టి యు ఆధ్వర్యంలో రైతులకు సంఘీభావం నిధి ఏర్పాటు సందర్భంగా రోషపతి మాట్లాడుతూ గత 25 రోజుల నుండి గజ గజ వణికే చలిలో ఢిల్లీ మహానగరంలో ఆందోళన చేస్తూ 29 మంది రైతులు అమరులైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని, ఇంకా ఎంత మందిని బలితీసుకుంటారని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈనెల 22వ, తేదీన ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి  రైతులకు మద్దతుగా ఇందిరా పార్కు వద్ద  చేయి తలపెట్టిన ఒక్కరోజు దీక్షకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు తెలపాలని కోరారు.

ఈ రైతుల పోరాటం భారతదేశంలోని సుదీర్ఘ పోరాటంగా గుర్తింపు పొందిందని, తక్షణమే ప్రభుత్వం గుర్తించి వ్యవసాయ మూడు చట్టాలని మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంఘీభావ నిధి  7,621.00 రూపాయలు వసూలు అయ్యాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా, మండల, నాయకులు ఎలక సోమయ్య గౌడ్, ఉప్పతల గోవింద్, ఎస్ కె ముస్తఫా, పర్వతాలు, గుండు వెంకన్న, యాదగిరి, మోసంగి శ్రీను, ఇంద్రమ్మ, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నిరసన

Satyam NEWS

భాషా పండితులు పి.ఈ.టి లకు న్యాయం చేయాలి

Bhavani

బ్రుటాలిటీ: పోలీసులు దారుణంగా వ్యవహరించారు

Satyam NEWS

Leave a Comment