రాజధాని గ్రామానికి చెందిన మహిళలపై పోలీసులు జరిపిన దాడిలో గాయపడిన శ్రీ లక్ష్మిని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. పోలీసుల దాడిలో గాయపడి ఆయుష్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న మందడం గ్రామస్తురాలు శ్రీ లక్ష్మిని పరామర్శించి కుటుంబ సభ్యులను అడిగి ఉదయం జరిగిన ఘటన వివరాలు తెలుసుకున్నారు.
మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు దారుణంగా వ్యవహరించారని వారు లోకేష్ కు తెలిపారు. దారుణంగా మా పై దాడులు చేసి మాపైనే కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు పోలీసులు అంటూ లోకేష్ కి మందడం గ్రామ మహిళలు తెలిపారు.