40.2 C
Hyderabad
April 28, 2024 16: 46 PM
Slider నల్గొండ

వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేసి రైతులను ఆదుకోవాలి

#CITU Hujurngar

నూతన వ్యవసాయ చట్టాలతో పంటలకు కనీస మద్దతు ధర ఉండదని రైతులందరూ దోపిడీకి గురి అవుతారని అందుకోసం మూడు చుట్టాలను రద్దు చేయాలని 18 రోజుల నుంచి ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులని ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ఆరోపించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డు రైస్ మిల్ ప్రాంతలో రైతులకు సంఘీభావంగా రైస్ మిల్లు దిన కూలీల ప్రదర్శన అనంతరం CITU కార్యాలయం వద్ద రాస్తారోకో చేసిన సందర్భంగా రోషపతి మాట్లాడుతూ గత 18 రోజుల నుండి ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు 11 మంది ఇప్పటి వరకు మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నెల 19 నుండి ఆమరణ నిరాహార దీక్షకు రైతు సంఘాలు నిర్ణయించారని, తక్షణమే వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రైతులను కాపాడాలని,ఎంత మంది రైతుల ప్రాణాలు తీస్తారని ప్రశ్నించారు. 2014 సంవత్సర ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏదైనా చెప్పండి వింటాను సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన మోడీ రైతులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోక పోవడం చూస్తుంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ దేశ రాజు ఫిడేలు వాయించిన విధంగా ఉందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలక సోమయ్య గౌడ్, రైస్ మిల్లు దిన కూలీలు యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు సాముల కోటమ్మ, మొదాల గోపమ్మ, ఉపతల గోవిందు, ఎస్ కే ముస్తఫా, అబ్దుల్, సుజాత, మున్ని, నరసమ్మ, శివమ్మ, వరమ్మ, పద్మ, యశోద, కమలమ్మ, తిరుపతమ్మ, మేరమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆర్మీ చాపర్ కూలిన ఘటనలో కల్నల్ మృతి పట్ల నివాళులు

Satyam NEWS

Breaking News: ఇళ్లపై కూలిపోయిన విమానం: 98 మంది మృతి

Satyam NEWS

పీవీఆర్ ఆర్ట్స్ ప్రొడక్ష‌న్ నెం-1 షూటింగ్ ప్రారంభం!

Bhavani

Leave a Comment