23.2 C
Hyderabad
November 29, 2021 16: 47 PM
Slider సినిమా

సినీ నటుడు మోహన్ బాబు పై కేసు నమోదు చేయాలి

#mohanbabu

గొర్లకాపరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు మంచు మోహన్ బాబు పై కేసు నమోదు చేయాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(GMPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు  ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు.

అనంతరం రవిందర్ మాట్లాడుతూ మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్(MAA)కు జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షులుగా గెలుపొందిన తర్వాత 11వ తేదీన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ ‘మా’ ఎన్నికల్లో ఘర్షణ ఏమిటీ? ఏమిటీ గొడవలు? ఏమిటీ భీభత్సం? ఇప్పుడు విద్యావంతులందరూ గమనిస్తున్నారు. “గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది… అతనూ చూస్తున్నాడు ఏం జరుగుతుందని, మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి” అని మాట్లాడారు.

ఈ వ్యాఖ్యలు గొర్లకాపరులను కించపరిచేలా ఉన్నాయన్నారు. గొర్రెల కాపర్ల దగ్గర సెల్ ఫోన్ ఉండొద్దా? వాళ్ళు చూస్తేనే సినీతారల గౌరవం పోతున్నట్లు మోహన్ బాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి తక్కువ చేసే మాటలు ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదన్నారు.

గొర్లకాపరులను కించపరిచేలా మాట్లాడిన మోహన్ బాబుపై కేసు ఫైల్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గొర్లకాపరుల అత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు.

ఇప్పటికైనా మోహన్ బాబు గొర్రెల కాపరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో GMPS రాష్ట్ర నాయకులు పులిగిల్ల మల్లేష్ యాదవ్, తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు గంగుల మధు యాదవ్, సోషల్ మీడియా ఇంచార్జి శ్రీశైలం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుతో ఈ రోజు కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, కరీంనగర్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, మేడ్చల్, ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల్లోని పలు పోలీసు స్టేషన్లలో కూడా ఫిర్యాదులు చేశారు.

Related posts

నిర్మల్ మునిసిపల్ ఎన్నికలకు బిజెపి సన్నాహకాలు

Satyam NEWS

తప్పు చేయని రేణుక ఆత్మహత్య చేసుకున్నది

Satyam NEWS

సాయం చేసేందుకు ఎమ్మెల్యేతో పోటీ పడుతున్న ఆయన కుమార్తె

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!