26.7 C
Hyderabad
April 27, 2024 08: 12 AM
Slider ఆంధ్రప్రదేశ్

గోవుల మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు డీజీపీ ఆదేశం

pjimage (12)

కొత్తూరు తాడేపల్లి గోశాల లో ఉన్న సుమారు 100 ఆవులు మృతి చెందిన సంఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ఆదేశించారు. పోస్టుమార్టం ప్రిలిమినరీ నివేదిక ప్రకారం గోవులపై టాక్సి సిటి (విషప్రయోగం) అని తేలింది. అయితే గడ్డి మినహా ఎలాంటి ఆహారం పొట్టలో లేవని పశు వైద్యులు నిర్ధారించారు. టాక్సిసిటీ కారణంగా శరీరం లోపల అవయవాల పై రక్తపు చారలు, ఊపిరితిత్తులు , గుండె పై అక్కడక్కడా రక్తపు చారలు ఉన్నట్లుగా కూడా వైద్యులు గుర్తించారు. అదే విధంగా మరణించి ఆవుల ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని కూడా డాక్టర్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గోవుల మృతిపై ఏసీపీ ఆధ్వర్యంలో డీజీపీ సిట్‌ను నియమించారు. నిజానిజాలు బయటపెట్టే వరకు సిట్‌ పనిచేస్తుందని తెలిపారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో ఎలాగైనా సరే కేసును ఛేదించాలని ఆయన నిర్ణయించారు. పశుసంవర్థకశాఖ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ప్రకాశం జిల్లా నుంచి ఆవులకు గడ్డి అందించేవారిని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డీజీపీ ఆదేశించారు.

Related posts

కుల సంఘాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడింది

Satyam NEWS

మిగిలిన డిగ్రీ సీట్లు

Murali Krishna

బీ రెడీ:యుద్దానికి సిద్ధంగా ఇరాన్ సైన్యం పెంచండి

Satyam NEWS

Leave a Comment