35.2 C
Hyderabad
April 27, 2024 11: 16 AM
Slider సంపాదకీయం

కరోనా నెగెటీవ్ వచ్చినా మీరు జాగ్రత్తలు పాటించాలి

#Corona Negitive

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

కరోనా వైరస్ బారిన పడినట్లు అనుమానం రాగానే చాలా మంది వెళ్లి పరీక్ష చేయించుకుంటున్నారు. ఇలా పరీక్షలకు వెళ్లిన వ్యక్తిని రెండు వారాలలోపు కలిసిన వారంతా ఆ వ్యక్తి కరోనా పరీక్షకు వెళ్లాడనగానే కంగారు పడిపోతున్నారు. ఒక వేళ అతనికి కరోనా పాజిటీవ్ వస్తే ఇక అంతే సంగతులు.

మొత్తం ఆయనను కలిసి వారంతా తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారు. ఆ వ్యక్తి కలిసిన వారంతా కూడా టెస్టుల కోసం పరుగులు పెడుతున్నారు లేదా రాపిడ్ టెస్టు కిట్లు తెచ్చుకుని పరీక్షలు చేసేసుకుంటున్నారు. నెగెటీవ్ వస్తే ఎంతో సంతోషంతో ఇక ఆ విషయం మరచిపోతున్నారు.

ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే

అసలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరూ కూడా ఇలా వచ్చే రిపోర్టు ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించకూడదు. తీవ్రమైన శ్వాస సమస్యలు ఉన్నవారికి కూడా కరోనా నెగెటీవ్ రావచ్చు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందే వారికి కూడా కరోనా టెస్టులో నెగెటీవ్ వచ్చే అవకాశం ఉంది.

తీవ్ర మైన గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు ఉన్నా కూడా కరోనా టెస్టులో నెగెటీవ్ వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ ఈ ప్రపంచానికి కొత్త. దీనిని గుర్తించడానికి సరైన అవకాశం కూడా లేదు.

రోగ నిర్ధారణ పరికరాలతో దీన్ని అత్యంత సమర్ధంగా కొలిచేందుకు ఇంకా అవకాశం లేదు. కేవలం రోగ లక్షణాలను చూసుకుని సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లడమే ఉత్తమమైన మార్గం. ఉత్తమమైన మార్గమే కాదు ఒక్కటే మార్గం. కోవిడ్ 19 టెస్టు రిజల్టు నెగెటీవ్ వచ్చిన వారు కూడా రిలాక్స్ కారాదు.

రిజల్టు నెగెటీవ్ వచ్చినా కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల తీవ్రతను ఈ విధంగా లెక్కించుకోవాలి. సమస్య (వ్యాధి కాదు) తీవ్రతను లెక్కించాల్సిన విధానం ఇది:

జ్వరం ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం 87.9 శాతం వరకూ ఉంటుంది

పొడి దగ్గు ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం 67.7 శాతం వరకూ ఉంటుంది

గొంతు నొప్పి ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం 38.1 శాతం వరకూ ఉంటుంది

శ్లేష్మం వస్తుంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం 33.4 శాతం వరకూ ఉంటుంది

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం 18.6 శాతం వరకూ ఉంటుంది

తలనొప్పి ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం 13.6 శాతం వరకూ ఉంటుంది

చలిజ్వరం ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం 11.4 శాతం వరకూ ఉంటుంది

తలతిరగటం, వాంతులు ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం 5.0 శాతం వరకూ ఉంటుంది

ముక్కుదిబ్బడ ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం 4.8 శాతం వరకూ ఉంటుంది

విరోచనాలు ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం 3.7 శాతం వరకూ ఉంటుంది

(బ్రాండ్ మార్కెట్ రిసెర్చి బ్యూరో Email:director@bmrb.in)

Related posts

పోలీసు కేసు ఇన్విస్టేగేష‌న్ లో ఆధారాలే ముఖ్యం

Satyam NEWS

సుప్రీంకోర్టుకు ఏపి ప్రధాన న్యాయమూర్తి?

Bhavani

ప్రభాస్ మద్దతు కు కేటిఆర్ కృతజ్ఞతలు

Satyam NEWS

Leave a Comment