32.7 C
Hyderabad
April 27, 2024 02: 33 AM
Slider విశాఖపట్నం

పోలీసు కేసు ఇన్విస్టేగేష‌న్ లో ఆధారాలే ముఖ్యం

#Vizag New 3

ఏదైనా కేసు ప‌రిశోధ‌న‌లో స‌మ‌గ్రంగా పూర్తి స్థాయిలో ల‌భ్య‌మైన ఆధార‌లే కీల‌క‌మ‌ని ఏపీ లోని విజ‌య‌న‌గ‌రం జిల్లా న్యాయ‌మూర్తి గోపీ అన్నారు. విశాఖ రేంజ్ పోలీస్ డ్యూటీ మీట్ సంద‌ర్బంగా రెండు రోజుల పాటు విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలోని బ్యారెక్స్ లో ప్రారంభ‌మైంది.

ఈ  మీట్  సంద‌ర్బంగా ఫోర్స‌నిక్, బాంబ్ ,డాగ్ స్క్వాడ్ ,గ్రైండ్ ప‌రిశీల‌న‌, వంటి అంశాల‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఏవిధంగాసేక‌రించాల‌న్నో అన్న దానిపై మూడు జిల్లాలలో సీఐ ర్యాంకు నుంచీ డీఎస్పీ స్థాయి వ‌ర‌కు పోలీస్ అధికారులుకు ఈ మీట్ న‌కు హాజ‌ర‌య్యారు.

ఈ మీట్ ను విజ‌య‌న‌గ‌రం జిల్లా న్యాయ‌మూర్తి గోపీ,రేంజ్ డీఐజీ రంగారావు,విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారీలు ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా  జ‌రిగిన సమావేశంలో జిల్లా న్యాయ‌మూర్తి గోపీ మాట్లాడుతూ…కేసు ప‌రిశోధ‌న‌లో ఆధారాలు ముఖ్య‌మ‌ని…త‌ద్వారా పోలీసులు కేసును త‌మ వ‌ద్ద‌కు తీసుకువ‌స్తే…స‌రైన తీర్పు చెబుతూ….గోపాల ప‌ట్నంలో త్రిపుల్ మ‌ర్డ‌ర్ కేసులో దోషుల‌కు పోలీసులు ఇచ్చిన ఆధారాల‌తోనే శిక్ష విధించిన‌ట్టు గుర్తుచేసారు.

అంత‌కుముందు రేంజ్ డీఐజీ రంగారావు మాట్లాడుతూ…ఈ రెండు రోజుల డ్యూటీ మీట్ లో ప‌లు కీల‌క అంశాల‌ను సిబ్బంది తెలుసుకోవాల‌న్నారు. ఈ మొత్తం కార్య‌క్ర‌మానికి ఎస్పీ రాజ‌కుమారీ..అధ్య‌క్ష‌త వ‌హించి…డ్యూటీ మీట్ లో మూడు జిల్లాల సిబ్బంది  ఏ విధమైన కోణాల‌లో ప‌రిశోధ‌న‌లు చేయాల‌లో తెలుసుకోవాల‌న్నారు. అలాగే విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణ‌రావు,అమిత్ బ‌ర్డార్ లు పాల్గొన్నారు.

అనంత‌రం..పోలీసు సిబ్బందికి యోగా,ప్రాణాయామం నేర్చుకుంటే మాన‌సిక ప్ర‌శాంతం ల‌భిస్తుంద‌ని పేర్కొంటూ…జిల్లాలోని పున్నపురెడ్డి పేట‌కు చెందిన ముస‌లినాయుడు(ల‌క్ష్మ‌ణానంద స్వామిజీ) చే వాటి గురించి సిబ్బందికి తెలియ చ‌సారు.

ఈ సంద‌ర్బంగా ల‌క్ష్మ‌ణానంద మాట్లాడుతూ..శ‌రీరరంలో రోగాల‌కు మూల కార‌ణం వేడి త‌గ్గ‌ట‌మేన‌ని ఆ వేడిని ర‌గిల్చే  మార్గ‌మే యోగమ‌ని..త‌మ గురువు స్వామి శ్రీరామానంద యోగ‌జ్ఙానాశ్ర‌మ వ్య‌వ‌స్థాప‌కులు స్వామి రామానంద‌,వారి గురువు స్వామి శివానంద లు ఎంద‌రో శిష్యుల‌కు ఇచ్చార‌ని గుర్తు చేసారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్బీ సీఐ లు శ్రీనివాస‌రావు,రాంబాబు,విజ‌య‌న‌గ‌రం వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీ,టూటౌన్ సీఐ శ్రీనివాసరావు,రూర‌ల్   సీఐ కృష్ణ‌వేణి,ఎస్ఐ వాసుదేవ్,‌తో పాటు బొబ్బిలి,కొత్త‌వ‌ల‌స‌,పార్వ‌తీపురం స‌బ్ డివిజ‌న్ ల డీఎస్పీలు పాల్గొన్నారు.

Related posts

ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం

Satyam NEWS

సోము వీర్రాజు కు రాచమల్లు వార్నింగ్…..

Satyam NEWS

కోలుకుంటున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్

Satyam NEWS

Leave a Comment