మౌని అమావాస్య సందర్భంగా శుక్రవారం వారణాసిలోని గంగ ఘాట్ లో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. మౌని అమావాస్య రోజు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాదిగా తరలివచ్చారు. ఈ రోజున ముక్కోటి దేవతలు త్రివేణి సంగమంలో కొలువుదీరుతారనేది భక్తులు ప్రగాఢ విశ్వాసం. ముక్కోటి దేవతలను స్మరించుకుంటూ గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.భక్తులకు సౌకార్యార్థం అన్నివిధాలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
previous post