31.7 C
Hyderabad
May 2, 2024 08: 20 AM
Slider నిజామాబాద్

మాయ మాటలు చెబుతున్న నిజామాబాద్ ఎంపి

vemula prashanth reddy

పసుపు బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం పసుపును కొని మద్దతు ధర ఇవ్వాలనేది రైతుల డిమాండ్. అది వదిలేసి నిజామాబాద్ ఎంపి అర్వింద్ మాయమాటలు చెబుతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఇది వరకే   స్పైస్‌బోర్డుకు వరంగల్‌లో ఓ ఆఫీసున్నది.

ఇద్దరు ఆఫీసర్లతో నిజామాబాద్‌లో మరో ఆఫీసు పెడతామంటున్నారు. దాంతో లాభమేమి లేదు. వరంగల్‌లో ఉన్నా నిజామాబాద్‌లో ఉన్నా ఒకటేనని ఆయన అన్నారరు. నిజామాబాద్‌లో ఓ ఆఫీసు పెడితే రైతులకు ఏం ఉపయోగం లేదు. అర్వింద్ ఇన్ని రోజులు మాయమాటలు చెప్పి ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నాడు అని మంత్రి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగింది పసుపు బోర్డు ఒక్కటే.

రైతులకు ఏమన్నా మేలు చేయాలంటే పసుపుబోర్డు వెంటనే ఏర్పాటు చేయాలె అని ఆయన డిమాండ్ చేశారు. మద్దతు ధర ప్రకటించి కేంద్రమే కొనుగోలు చేయాలి. ఇదే రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సాగు నీరు తెస్తున్నారు. ఎకరానికి పదివేల రూపాయల మద్దతు ధర ఇస్తున్నారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా అయ్యేలా చూస్తున్నారు.

రైతులకు 24 గంటల కరెంటునిస్తున్నారు. రైతులకు ఏమేమి అవసరమున్నాయో.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఏమేమి చేయాలో అన్నీ కేసీఆర్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇదొక్క పని చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంతే కానీ ఇలాంటి తప్పుడు ప్రకటనలిచ్చి మోసం చేసే పని మానుకోవాలని ఆయన హితవు పలికారు.

Related posts

నెల్లూరు జిల్లాలో మరో ఎమ్మెల్యే అనిల్ ఔట్ ?

Bhavani

8న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొనాలి

Satyam NEWS

తిమ్మప్ప స్వామి దేవాలయంలో అన్నదానం

Satyam NEWS

Leave a Comment