28.7 C
Hyderabad
April 27, 2024 05: 58 AM
Slider ఆదిలాబాద్

మహిళా వీఆర్ఏల పట్ల కీచకుడిగా మారిన ఎమ్మార్వో

#penchikalpet

ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరే వారిపట్ల అందరికి సానుభూతి ఉంటుంది. వారికి ఏదోక విధంగా సాయం చేయాలనే ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ఈ తాసిల్దార్ ఏం చేశాడో తెలుసా? వీఆర్ ఏలను వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి వత్తిడి తెచ్చాడు.

మహిళా వీఆర్ఏ లను అయితే తన కోరికలు తీర్చాలని బలవంతం చేస్తున్నాడు….. ఈ దారుణ సంఘటన ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో జరిగింది. జీవన పోరాటంలో అలసిపోతున్న తమను ఆదుకోవడం అటుంచి ఎమ్మార్వో అనంతరాజు ఇలా చేయడం పై వీఆర్ఏలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మార్వో అనంతరాజు వీఆర్ఏ పై లైంగిక వేధింపులు జరపడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన వ్యక్తిగత అవసరాల కోసం మహిళా వీఆర్ఏలను వాడుకోవాలని చూడటం దారుణమని అంటున్నారు.

వీఆర్ఏలు గత కొన్ని రోజులుగా సమ్మెలో ఉన్న కూడా వ్యక్తిగత అవసరాల కోసం పిలిపించుకోవడం నానా దుర్భాషలాడడం కక్షగట్టడం లాంటి చర్యలు చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఈ కీచకుడి చర్యలను వీఆర్ఏలు ముక్తకంఠంతో ఖండించారు.సాటి మహిళలను లైంగికంగా వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. నీ భర్త తాగుబోతు నిన్ను ఏం చూసుకుంటాడు నీ పిల్లలకి ఏం చేస్తాడు నా గదికి రా అన్ని విధాలుగా నిన్ను ఆదుకుంటాను అని ఒక మహిళతో అతను అన్నాడు. అదే విధంగా మాట వినలేదంటే వ్యక్తిగతగా కక్ష పెంచుకోవడం ఇబ్బందులకు గురి చేయడం లాంటివి మొదలుపెడుతున్నాడని మహిళా వీఆర్ఏలు తమ గోడు వెళ్ళబోసుకున్నారు.

Related posts

విద్యార్థులు అక్షయ పాత్ర ఫౌండేషన్ సందర్శన

Satyam NEWS

హైదరాబాద్‌లో ఏడీపీ ఇండియా 23 వ వార్షికోత్సవం

Satyam NEWS

అక్కడ పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఖాకీలు మౌనం…!

Bhavani

Leave a Comment