29.7 C
Hyderabad
April 29, 2024 09: 56 AM
Slider మహబూబ్ నగర్

రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి వాల్ పోస్టర్ విడుదల

#mrps

భారత రాజ్యాంగాన్ని మార్చి రాయాలని అహంకార వైఖరిని ప్రదర్శించిన కేసీఆర్ విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 9న నిర్వహించబోతున్న చలో హైదరాబాద్ రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి మహాసభ వాల్ పోస్టర్లు నేడు విడుదల చేశారు. కొల్లాపూర్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ మహాసభ వాల్ పోస్టర్లు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను, సర్వమానవ సౌభ్రాత్వత్వాన్ని ప్రసాదించిన మహా గ్రంధమని అన్నారు. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, మహిళా రక్షణ కవచం అయిన భారత రాజ్యాంగాన్ని మార్చటం అంటే మన అస్తిత్వాన్ని, మన చైతన్యాన్ని మనమే కోల్పోవడం అవుతుందని వారన్నారు.

దీనికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్న దొరల కుట్రలను మనం ఇప్పుడే ఎదుర్కొనకపోతే మన భావితరాలకు మనం అన్యాయం చేసినట్లు అవుతుందని వారన్నారు. రాజ్యాంగం జోలికొస్తే రాజకీయ సమాధి చేస్తామని మన అందరం కలిసికట్టుగా గొంతు ఎత్తకపోతే ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు పుట్టుకొస్తూనే ఉంటారని వారు తెలిపారు.

ఏప్రిల్ 9న హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్ వరకు జరిగే మహా ర్యాలీ జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం మహా సభను నిర్వహిస్తున్నామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో MRPS జాతీయ నాయకులు మంద నరసింహ, MRPS తాలూకా కన్వీనర్ సంపంగి మద్దిలేటి ,MSF జిల్లా సీనియర్ నాయకులు వై. యాదగిరి మాదిగ MRPS జిల్లా కార్యదర్శి అగ్ర స్వామి పెంట్లవెల్లి మండల్ అధ్యక్షుడు రాముడు, వీపనగండ్ల మండల అధ్యక్షుడు నాగరాజ్, కోడేరు మండల అధ్యక్షుడు పసుపుల కృష్ణయ్యా, కొల్లాపూర్ మండల అధ్యక్షుడు పరమేష్, మరియు బాలస్వామి లక్ష్మణ్, రమేష్ MSFనాయకులు నాగులపల్లి శివ, శ్రీకృష్ణ ,కృష్ణ ,నాగరాజు ,సుదర్శన్ ,మహేష్, ప్రవీణ్, శివ, రఘు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మాల మహానాడు మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా పాశం

Satyam NEWS

అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్ల పట్టివేత

Bhavani

కొల్లాపూర్ లో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment