38.2 C
Hyderabad
April 29, 2024 20: 03 PM
Slider నిజామాబాద్

ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి

#jukkal

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన విధంగా  కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం  సందర్భంగా ప్రజా పాలన అభయ హస్తం  కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా  ఎంపిక చేసిన గ్రామపంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో గ్రామసభ నిర్వహించి   ముఖ్యమంత్రి సందేశాన్ని పంచాయతీ కార్యదర్శులు వివరించిన అనంతరం  దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. కుటుంబ వివరాలతో పాటు మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు పథకం, గృహ జ్యోతి పథకం, చేయూత పథకం తదితర వివరాలను దరఖాస్తులో వివరించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి జూకల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు నిజాంసాగర్, మహమ్మద్ నగర్,  బిచ్కుంద మండలాల్లో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం ప్రజా పాలన దరఖాస్తులను వారి వారి గ్రామపంచాయతీలలో పూర్తి సమాచారంతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,  ఆయా మండలాల  ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారానికి చర్యలు తీసుకోవాలని పిల్

Satyam NEWS

సామాన్యుల నడ్డి విరిస్తున్న మోడీ ప్రభుత్వం

Satyam NEWS

రాక్షసానందం పొందుతున్న సోషల్ మీడియా

Satyam NEWS

Leave a Comment