38.2 C
Hyderabad
April 28, 2024 22: 01 PM
Slider ముఖ్యంశాలు

రౌడీలా వ్యవహరిస్తున్న టిఆర్ఎస్ పార్టీ కి చెందిన కాంట్రాక్టర్

#KollapurMunicipality

పాఠశాలలోకి  మురికి నీరు రాకుండా, భవనానికి సమస్య వాటిల్లకుండా, విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా డ్రైనేజ్   నిర్మాణం చేపట్టాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాంట్రాక్టర్ ను కోరారు. అయితే కాంట్రాక్టర్ టిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి.

కాంట్రాక్టర్ పవన్ కుమార్ రెడ్డి   ఎవరికీ చెప్పు కుంటావో  చెప్పుకో నేను చేసేదే ఇది,  ఎక్కువ మాట్లాడితే “నీ అంతు చూస్తా” అని బెదిరింపులకు గురి చేశాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈశ్వరయ్య చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్  పూర్ పట్టణ కేంద్రంలోని జియుపిఎస్ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల పక్కల డ్రైనేజీ  నిర్మాణం చేపడుతున్నారు.

పాఠశాలకు సమస్య కలవకుండా, డ్రైనేజ్ లో బురదను తొలగించి, బెడ్ వేసి నిర్మాణం చేపట్టాలని చెప్పామన్నారు. అయితే కాంట్రాక్టర్ పవన్ కుమార్ రెడ్డి  బెదిరింపులకు  పాల్పడ్డాడని చెప్పారు. ఎక్కువ మాట్లాడితే నీ అంతు చూస్తా ననీ  బెదిరించాడని చెప్పారు.

అయితే మోరి కాలువ దృశ్యాలును వీడియో తీసి మున్సిపల్ అధికారులకు,చైర్ పర్సన్  కు పపించ నాని చెప్పారు. మున్సిపల్ ఏఈ వచ్చి సమస్యను చూసి  బెడ్ వేసి నిర్మాణం చేయాలని కాంట్రాక్టర్ కు చెప్పిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

పాఠశాల గోడలు తడిసి పొయ్యి భవనం పూర్తిగా దెబ్బతింటుదని, మురికి నీరు క్లాస్ రూమ్ లోకి వస్తున్నాయి, విద్యార్థుల అనారోగ్యానికి గురవుతున్నారని, పాఠశాల కు ఇబ్బంది కలగకుండా నిర్మాణం చేయాలని  చెబితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రధానోపాధ్యాయుడు ఆవేదన కు గురైయ్యారు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ప్రధానోపాధ్యాయుడు తన ఇంటికి కోసం, తన సొంత ప్రయోజనం కోసం మాట్లాడలేదు.

పాఠశాల  విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అడగడంతో కాంట్రాక్టర్ పవన్ కుమార్ రెడ్డి బెదిరింపులకు  పాల్పడడం సమంజసం కాదని పట్టణ వాసులు అంటున్నారు. నేను ఆ విధంగా  మాట్లాడలేదని  కాంట్రాక్టర్ పవన్ కుమార్ రెడ్డి చెబుతున్నాడు. అవసరమైతే నిర్మాణమే చెయ్యను, కాంట్రాక్టు వదులుకుంటానని అంటున్నాడు.

Related posts

ఏజెన్సీ ప్రాంత వాసులకు అండగా పోలీసులు

Murali Krishna

ఉగ్రవాదులకు అండగా ఉంటున్న వైసీపీ నేతలు

Satyam NEWS

రైతుల ఉసురు పోసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాలు

Satyam NEWS

Leave a Comment