33.7 C
Hyderabad
April 27, 2024 23: 16 PM
Slider ఆదిలాబాద్

ఆస్తిపన్ను వంద శాతం వసూలు చేయండి

#Nirmal Collector

నిర్మల్ జిల్లాలోని మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వందశాతం వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో ఆస్తిపన్ను వసూలు, పారిశుధ్యం, పట్టణ ప్రగతి పనులపై పురపాలక శాఖ ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలలో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలన్నారు. పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. టౌన్ ప్లానింగ్ కు సంబంధించి నూతన మాస్టర్ ప్లాన్ కొరకు త్వరగా అనుమతులు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు.

పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటినుండి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా సేకరించాలని, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

పట్టణ పార్కుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని, ప్రతి వార్డులో ట్రీ పార్క్ ఏర్పాటు, నర్సరీల ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన వ్యాపార సముదాయాలలో ప్రతి నెల అద్దె వాసులుచేయాలన్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న లే ఔట్లను, భవనాలను నిలిపివేయాలన్నారు.

ఆర్థిక, అడిట్ అంశాలను పరిశీలించాలన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, బిల్ కలెక్టర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, జాబీర్ అమ్మద్, రాజేందర్, మున్సిపల్ కమిషనర్లు ఎంఏ ఖాదీర్, గంగాధర్, అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

తగ్గుతున్న సినీ నిర్మాణాలు

Bhavani

డ్రంక్ & డెడ్:మంచంపై నుంచిపడి యువకుడు మృతి

Satyam NEWS

వరద బాధితులకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏమిచ్చాడో తెలుసా?

Satyam NEWS

Leave a Comment