29.7 C
Hyderabad
April 29, 2024 08: 14 AM
Slider ముఖ్యంశాలు

వెనుకబడిన కులాల తరహాలోనే మున్నూరు కాపులను ఆదుకోవాలి

#munnuru kapu

మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సాధించేవరకు పోరాడాలని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి పటేల్ డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ములుగు నియోజకవర్గ కన్వీనర్ పిట్టల మధుసుధన్ పటేల్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా నల్లెల్ల కుమారస్వామి పటేల్ హాజరై మాట్లాడుతూ ట్టు పట్టాలి మున్నూరు కాపు కార్పొరేషన్ సాధించాలని పిలుపు నిచ్చారు.

వెనుక బడిన కులాలలో వ్యసాయం ప్రధాన వృత్తిగా నమ్ముకొని జీవిస్తున్న మున్నూరు కాపుల అభివృద్ధి కి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అయన ఆవేదన వ్యక్తం చేశారు. వెనుక బడిన తరగతులులలోని ఇతర కుల వృత్తుల వారికీ వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం లబ్ది చేకూర్చాడానికి చేస్తున్న కృషికి  అభినందనలు తెలిపారు.

మున్నూరు కాపులు ఆరుగాలం కస్టపడి పంటలు పండించినా గిట్టుబాటు ధర రాక పకృతి వైపరీత్యాలకు నష్టపోయి దిక్కు తోచని స్థితిలో జీవిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. దీనికి పరిస్కారం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటే మార్గమని అన్నారు. కార్పొరేషన్ సాధనకు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా కార్యాచరణను ప్రకటించుకొని ముందుకు

 సాగాలన్నారు.ములుగు నియోజకవర్గ కన్వీనర్ పిట్టల మధుసూదన్ పటేల్ మాట్లాడుతూ  గ్రామ గ్రామ న మున్నూరు కాపులు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని  గ్రామ సంఘాల ద్వారానే మండలం, జిల్లా,రాష్ట్ర సంఘాలు ఏర్పడుతాయని తెలిపారు.కుల అభిమానం ఉండడం తప్పులేదని కుల ద్వేశం ఉండవద్దని అయన సూచించారు.మున్నూరు కాపులు సంఘటితమై ఆర్థికంగా, సామజికంగా, రాజకీయంగా ఎదగాలని కోరారు.

ప్రతి జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు భవనం నిర్మాణానికి స్థలం కేటాయించిన నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు శ్రీ బాలాజీ మున్నూరు కాపు పరపతి సంఘం అధ్యక్షులు కాపిడి సంపత్ కుమార్ పటేల్, మున్నూరు కాపు సంఘం ములుగు మండల కన్వీనర్ సిరికొండ బలరాం పటేల్, జిల్లా నాయకులు చింత నిప్పుల బిక్షపతి పటేల్, మేకల ప్రశాంత్ పటేల్, సుంకరి రవీందర్ పటేల్, ఆకుతోట చంద్రమౌళి పటేల్, కాపిడి ప్రభాకర్ పటేల్, గందె మధు పటేల్, గడ్డం రాజు పటేల్, గండ్రతు విజయకర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్పంద‌న కార్య‌క్ర‌మం: మరోసారి స‌మ‌స్య‌తో వ‌చ్చిన టీడీపీ….!

Satyam NEWS

పెట్రో ధరపై నరసరావుపేటలో ఎంఐఎం వినూత్న నిరసన

Satyam NEWS

తెలంగాణ బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదు

Sub Editor 2

Leave a Comment