38.2 C
Hyderabad
April 29, 2024 13: 04 PM
Slider సినిమా

ఆన్లైన్ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్న టిక్ టాక్

#Music Star

సృజనాత్మకత తోనే కొత్త సంగీతం ఉద్భవిస్తుంది. అలాంటి కొత్త సంగీతాన్ని సృష్టించేందుకు కళాకారులు, సంగీత దర్శకుల ఆవిష్కరణకు శక్తివంతమైన వేదికగా టిక్‌టాక్‌ మారింది. ఈ ప్రయాణంలో ఒక అడుగు ముందుకు వేసి, కొత్త స్వతంత్ర సంగీత ప్రతిభను కనుగొనటానికి యాప్‌లో రీజినల్‌ మ్యూజిక్‌ టాలెంట్‌ హంట్‌ #MusicStarTelugu నిర్వహిస్తున్నట్లు టిక్ టాక్ ప్రకటించింది.

జూన్ 7 న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, పంజాబీ, బెంగాలీలతో సహా ఆరు భారతీయ భాషలలో ఈ టాలెంట్‌ హంట్‌ ప్రారంభమవుతుంది. ఈ టాలెంట్‌ హంట్‌లో విజేతలను జూన్ 21, ప్రపంచ సంగీత దినోత్సవం రోజున ప్రకటిస్తారు. ఉత్తేజకరమైన నగదు బహుమతులు గెలుచుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.

విజేతలు సోషల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేకంగా లభించే ప్రముఖ మ్యూజిక్ లేబుల్‌తో సంగీతాన్ని రికార్డ్ చేయడానికి, విడుదల చేయడానికి రెస్సో ద్వారా అవకాశం పొందుతారు. ప్రముఖ కళాకారులు, ప్రసిద్ధ సంగీత దర్శకులు వారి ప్రాంతం నుండి ప్రతిభ ఉన్న కళాకారుల్ని ఎంకరేజ్‌ చేస్తారు.

ప్రేక్షకుల నుంచి ఓటు తెచ్చుకోవాలి

తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ కళాకారుల కోసం జి.వి.ప్రకాష్, సంగీత రాజీవ్, అనుప్ రూబెన్స్, కె.ఎస్. చిత్ర అందుబాటులో ఉంటారు. అలాగే పంజాబీ కోసం సుఖ్‌-ఇ, బెంగాలీ కోసం నుస్రత్ జహాన్.. పాల్గొనేవారి విశ్వాసాన్ని పెంచడం, ప్రోత్సహించడం తమ అభిమాన పోటీదారునికి ఓటు వేయడం చేస్తారు.

వినియోగదారులు వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని, ప్లాట్‌ఫామ్‌లో వారి హిట్ పాటలను ప్రదర్శించడం కూడా చూడవచ్చు. ఈ షో ప్రతి ప్రాంతం సంస్కృతి సంగీతాన్ని అందరికి తెలియచేస్తుంది. ఈ ప్రాంతంలోని వర్ధమాన సంగీత ప్రతిభకు వేదికను అందించడంపై దృష్టి పెడుతుంది.

దేశంలో ఉన్న ప్రతిభను వెలికి తేవడమే ఉద్దేశ్యం

ఈ సందర్భంగా టిక్ టాక్ ప్రతినిధి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. భారతదేశం అద్భుతమైన ప్రతిభను కలిగి ఉంది, ముఖ్యంగా సంగీతం విషయానికి వస్తే ఆ ప్రతిభ అద్భుతం. ఇక క్రియేటివిటీ అనేది టిక్ టాక్ DNA లో అంతర్భాగం. మేము చాలా మంది ప్రముఖ సృష్టికర్తలు, సంగీతకారులు చూశాం.

కళాకారులు తమ ప్రతిభను అందరికి తెలిపేందుకు ఈ వేదికను ఉపయోగిస్తున్నారు. అందుకోసం అలాంటి యువతను ఎంకరేజ్‌ చేసే ఉద్దేశంతో #MusicStarని మొదలుపెట్టాం. దీనిద్వారా ఆకర్షణీయమైన కంటెంట్‌ను వీక్షకులకు అందించడమే కాకుండా, దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుతుంది.

ఇది ఒక మంచి ప్రయోగం:అనూప్ రూబెన్స్

ఈ సందర్భంగా అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ.. భారతదేశం ప్రతిభతో మెరిసిపోతోంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు సమాజంలో ప్రతిభను కనుగొనటానికి టిక్‌టాక్‌ #MusicStarTelugu ఒక గొప్ప ప్రయత్నం అని నేను భావిస్తున్నాను. వినియోగదారుల నుండి సంగీత టాలెంట్‌ని చూడటానికి నేను సంతోషిస్తున్నాను.

అది పాటైనా, వాయిద్యమైనా సరే.. అని అన్నారు ఆయన. ఆదిత్య మ్యూజిక్‌ ఎల్లప్పుడూ సృజనాత్మక సంగీత సోదరభావంతో నిలిచింది, కొత్త గాయకులకు, స్వరకర్తలకు అవకాశాలను ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది. మా ఇటీవలి పాట బుట్ట బొమ్మ టిక్‌టాక్ గ్లోబల్ ప్లాట్‌ఫామ్ ద్వారా విజయాన్ని సాధించింది.

అన్నింటిలోనూ ముందు ఆదిత్య మ్యూజిక్

కొత్త ప్రతిభకు వేదికను అందించే శక్తి టిక్‌టాక్‌కు ఉందని మేము నమ్ముతున్నాం. #MusicStarTelugu విజేతతో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నామని అన్నారు ఆదిత్య మ్యూజిక్ యజమాని ఆదిత్య గుప్తా. రెండు వారాల్లో #MusicStar వాయిద్యకారులు, గాయకులు, బృందాలు, సంగీత నిర్మాతలు / స్వరకర్తల నుండి పాల్గొనడాన్ని ఆహ్వానిస్తుంది.

పాల్గొనడాన్ని సులభమైన ప్రక్రియగా చేస్తూ, వారి ప్రతిభను ప్రదర్శించే వీడియోను టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్‌ చేసేముందు సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌ని కచ్చితంగా ఉంచాలి. ఆ హ్యాష్‌ట్యాగ్‌ ఏవంటే… #MusicStar hashtags (#MusicStarTamil, #MusicStarTelugu, #MusicStarMalayalam, #MusicStarKannada, #MusicStarPunjabi, #MusicStarBengali

#MusicStarKannada క్యాంపెయిన్ దశలు:

ఫేజ్‌ 1 – జూన్ 7-14: ప్రతి భాష నుండి 10 మంది షార్ట్‌లిస్ట్ విజేతలు అత్యధిక లైక్స్, నాణ్యత, సంగీత కంటెంట్ ఆధారంగా ఎంపిక అవుతారు.

ఫేజ్‌ 2 – జూన్ 15: ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది, వినియోగదారులు తమ అభిమాన స్వతంత్ర సంగీతకారుడికి ఓటు వేయడానికి, మద్దతు ఇవ్వడానికి ప్రోత్సహిస్తాం.

ఫేజ్‌ 3 – జూన్ 21: అత్యధిక ఓట్ల ఆధారంగా, ప్రతి భాష నుండి 5 మంది ఫైనలిస్టులను పోటీ విజేతలుగా ఎన్నుకుంటారు.

Related posts

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి విశేష పూజలు

Satyam NEWS

మట్టిరోడ్డు లేకుండా చేస్తా: మంత్రి గంగుల కమలాకర్

Satyam NEWS

ఏపిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

Satyam NEWS

Leave a Comment