30.7 C
Hyderabad
April 29, 2024 06: 08 AM
Slider గుంటూరు

రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలి

#MslimJAC

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలకు మద్దతుగా గురువారం ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించారు.

నరసరావుపేట ప్రకాష్ నగర్ ఈద్గా గ్రౌండ్ నుండి  టౌన్ హోల్ మీదుగా ఓవర్ బ్రిడ్జ్ లో నుండి ఏంజల్ టాకీస్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్ళి  ఆర్డీవో కార్యాలయంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు.

అనంతరం సబ్ కలెక్టర్ శ్రీవాస్ నూపూర్ అజేయేకుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రఫీ మౌలానా, పేష్ మామ్ బాసిత్, వైసీపీ మైనార్టీ నాయకులు మునాఫ్, గఫర్ బేగ్, న్యాయవాది అబ్దుల్ రజాక్,సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యస్ కె. జిలానిమాలిక్,

అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు నాగేశ్వరరావు, శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి డి. శివకుమారి, అవాజ్ జిల్లా నాయకులు సిలార్ మసూద్, జనసేన నాయకులు అద్రుఫ్,మస్తాన్ వలి,బాజి, యమ్.ఐ.యమ్. నాయకులు మస్తాన్ వలి, కరిముల్లా,

టీడీపీ మైనార్టీ నాయకులు బడే బాబు,ఖలీల్, దళిత సంఘం నాయకులు చెల్లి కిషోర్, రహేమాన్, సుబాని,చందు, బాషా, తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత వారం రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ తదితర ప్రాంతాల్లో రైతులు చలిని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తున్నారని వారికి ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియణ తదితర రాష్ట్ర ల్లో భారతీయ కిసాన్ యూనియన్,

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘలు,పలు కుల సంఘాలు రైతుల నిరసనకు మద్దతు ప్రకటించాయని, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నదని ప్రభుత్వం రైతుల ను ఆదుకోవాలని తెలిపారు

Related posts

అలవాటులో పొరబాటు: …ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే…

Satyam NEWS

హుజూరాబాద్ లో కోట్లు ఖర్చు చేస్తున్న అధికార టీఆర్ఎస్

Satyam NEWS

సవాళ్ళకు సమాధానం లేని బడ్జెట్‌

Murali Krishna

Leave a Comment