26.7 C
Hyderabad
April 27, 2024 10: 27 AM
Slider ఖమ్మం

మూడు మతాల సాక్షిగా ఏడు అడుగులు వేసిన జంట

#MarriagePhotos

వధువు ముస్లిం, వరుడిది క్రైస్తవం అయితే వారిద్దరూ ఇలా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మతసామరస్యాన్ని చాటిన ఈ వివాహం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో ఆదివారం జరిగింది.

ఇదే గ్రామానికి చెందిన కోపెల అనిల్‌కుమార్‌, ఖమ్మం అర్బన్‌ మండలం గొల్లగూడేనికి చెందిన షేక్‌ సోని మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం తెలపగా, వరుడి కుటుంబం అంగీకరించింది. పెద్దల నిర్ణయం మేరకు హిందూ వివాహ పద్ధతిలో వధువు మెడలో మూడు ముళ్లు వేశాడు పెళ్లికొడుకు.

ఇద్దరూ ఒక్కటై కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు.

Related posts

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్

Murali Krishna

వెబ్ సైట్ నుంచి ఖైరతాబాద్‌ గణేషుడికి పూజలు

Satyam NEWS

వేద విద్వ‌త్ ఆగ‌మ స‌ద‌స్సుకు మెరుగ్గా ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment