38.2 C
Hyderabad
May 2, 2024 21: 19 PM
Slider నల్గొండ

మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట మౌన దీక్ష చేసిన ముస్లింలు

#hujurnagarmuslims

మసీదు కాంప్లెక్స్ అద్దెలు పెంచాలని, గడువు ముగిసిన దుకాణాల సముదాయానికి బహిరంగ వేలం వేయాలని డిమాండ్ చేస్తున్న ముస్లింలు నేడు మహ్మాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉస్మానియా మసీదు కాంప్లెక్సు వ్యవహారంలో గత 8 రోజులుగా ముస్లిం సోదరులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

జాతిపిత మహాత్మా గాంధీ 74వ వర్ధంతిని పురస్కరించుకుని గాంధీజీ చూపిన శాంతియుత మార్గంలో ఆదివారం ముస్లిం సోదరులు నిరసన వ్యక్తం చేశారు. ముస్లిం సోదరులు గాంధీ విగ్రహం వరకు బ్యానర్లు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి విగ్రహం ఎదుట గాంధేయ మార్గంలో మౌన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ రాష్ట్ర నాయకులు ఎండి.అజీజ్ పాషా ముస్లిం సోదరులు చేపట్టిన  శాంతియుత మౌన దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ ఉస్మానియా మసీదు వక్ఫ్ షాపింగ్ కాంప్లెక్స్ గడువు ముగిసినందున లీజుదారులు కిరాయిలు పెంచాలని డిమాండ్ చేశారు.

గత ఎనిమిది రోజులుగా ముస్లిం సోదరులు అనేక రూపాలలో శాంతియుతంగా ఆందోళన,నిరసన   కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని,మసీదు అభివృద్ధికి ఆటంకం ఏర్పడి మసీద్ లో పనిచేసే కుటుంబాల వారికి జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి కలుగుతుందని అన్నారు .

వక్ఫ్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం వీడి స్పందించాలని కోరారు. మార్కెట్ లో ప్రస్తుతమున్న అద్దెలు 20 వేల నుండి 25 వేల వరకు నడుస్తున్నా ప్రస్తుతం గడువు ముగిసిన లీజుదారులు ఇస్తున్న అద్దె కేవలం రెండు వేల నుండి మూడువేల రూపాయల వరకే ఉండటం చాలా బాధాకరమని అన్నారు.

ఈ విషయమై రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డు అధికారులకు కూడా ఫిర్యాదు చేయటం జరిగిందని అజీజ్ పాషా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంబంధిత వక్ఫ్ బోర్డు  అధికారులు తక్షణమే స్పందించి మసీదు కమిటీ పెంచిన అద్దెలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదా బహిరంగ వేలం వేసి అర్హులైన పేద ముస్లిం సోదరులు దుకాణాలు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, వారి ఆవేదనను అర్థం చేసుకొని ముస్లిం సోదరులకు దుకాణాలు కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మహ్మద్ రహీం భాయ్, బాజీ ఉల్లా, భిక్కన్ సాబ్, సయ్యద్ మున్ను,మిల్లు రహీమ్,అబ్దుల్లా,లైటింగ్ జానీ, దస్తగిరి, గౌస్ ఖాన్, సల్లావుద్దీన్, జానీ,ఇబ్రహీం,వీురా,పైల్వాన్,మజీద్, హుస్సేన్,ముస్తఫా,రసూల్,భాషా,ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

రోడ్డు ప్రమాదం. .ఒకరు మృతి

Bhavani

ఏలూరులో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన

Satyam NEWS

పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నా కూతురు కాదు

Satyam NEWS

Leave a Comment