40.2 C
Hyderabad
April 29, 2024 15: 11 PM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పై బదిలీ వేటు

#Nagarkurnool Collector

నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ పై బదిలీ వేటు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్లక్ష్యం వహించడం పై కలెక్టర్ శ్రీధర్ పై వేటు పడిందని సమాచారం. అదేవిధంగా పల్లె ప్రగతి నిధులు దుర్వినియోగం కూడా జరిగిందనే అభియోగాలు ఉన్నాయి.

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని  నిర్లక్ష్యం వహించడం పై  రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంతో  ఈ చర్యలు తీసుకున్నట్లు, ఇంక మరేఇతర జిల్లా అధికారులు ఇలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఉద్దేశంతోనే  కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా కు వనపర్తి జిల్లా కలెక్టర్ యాసిన్ భాషా కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. జిల్లాలో మరో అధికారి పై కూడా  చర్యలు ఉంటాయని సంకేతాలు కనిపిస్తున్నాయి.

Related posts

ములుగు ఏరియా ఆసుపత్రిలో కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

Satyam NEWS

పవర్ కోసం పాట్లు పడుతు రైతుల రాస్తారోకో

Satyam NEWS

ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలి

Satyam NEWS

Leave a Comment