28.7 C
Hyderabad
April 27, 2024 04: 00 AM
Slider ముఖ్యంశాలు

మరో సారి సత్తా చాటిన నల్లగొండ  జిల్లా పోలీసులు

#DIGRanganath

అతనొక రైతు….. తన వ్యవసాయ భూమిలో బోరు, పైప్ లైన్ వేసుకునేందుకు తన భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకొని తిరుగుపయనం అవుతున్న క్రమంలో దారిలో అడ్డగించి ఆ సొమ్మును కాజేశారు గుర్తు తెలియని దొంగలు….

బాధితుడు వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం చేరవేసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు…. తక్షణం స్పందించిన నల్లగొండ జిల్లా పోలీసులు దొంగలను గుర్తించి పట్టుకునేందుకు ఎంతో కృష్జి చేశారు…. దొంగతనం చేసిన దొంగలు పరారీలోనే ఉండగా సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా వారిని పాత నేరస్థులుగా గుర్తించి వారి చిరునామాలు కనిపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాకు వెళ్లి మరీ బాధితుని సొమ్ము కుటుంబ సభ్యుల నుండి రికవరీ చేసి డిఐజి ఏ.వి. రంగనాధ్ చేతుల మీదుగా బాధితునికి అందజేసి ప్రశంసలు పొందారు. శాలీగౌరారం, నకిరేకల్ పోలీసులు…. దారి దోపిడిలో పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసి అందజేయడంతో బాధితుని కుటుంబంతో పాటు ఆ గ్రామస్థులు పోలీసుల కృషిని అభినందించి శభాష్ నల్లగొండ పోలీస్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

ఇక వివరాలలోకి వెళితే కొద్ది రోజుల క్రితం సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరి మండలం ఆనంతారం గ్రామానికి చెందిన రైతు చెరుకు నర్సయ్య నల్లగొండ జిల్లా ఐసిఐసిఐ బ్యాంక్ నకిరేకల్ బ్రాంచులో తన వ్యవసాయ భూమిలో బోరు, పైప్ లైన్ నిమిత్తం 6 లక్షల 4 వేల రూపాయల రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణం సొమ్ముతో తన గ్రామానికి తిరుగు పయనం అయిన క్రమంలో శాలిగౌరరం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరిక కొండారం వద్ద రోడ్డు మరమ్మత్తులు జరుగుతున్న ప్రాంతంలో వాహనం దిగి అవతలి అవతలి వైపుకు వెళ్తున్న నర్సయ్యను రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డగించి బెదిరించి అతని వద్ద ఉన్న 6 లక్షల నాలుగు వేలు దొంగిలించి పరారయ్యారు.

వెంటనే డయల్ 100కు సమాచారం రావడంతో స్పందించిన నకిరేకల్, శాలిగౌరరం పోలీసులు దొంగలను పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. పరారైన దొంగల జాడ తెలియకపోవడంతో సిసి కెమెరాల ఫుటేజ్ పై దృష్టి సారించిన పోలీసులకు దారి దోపిడికి పాల్పడిన ముఠా పాత నేరస్థులుగా, వారంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాకు చెందిన వారీగా గుర్తించి అక్కడికి వెళ్లారు. వారి కుటుంబాల నుండి దోపిడికి గురైన సొమ్మును రికవరీ చేసి గురువారం డిఐజి రంగనాధ్ చేతుల మీదుగా బాధిత రైతు నర్సయ్యకు అప్పగించారు.

ఈ కేసులో సమర్ధవంతంగా పని చేసిన నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, బాధితుని సొమ్ము రికవరీ చేసిన శాలిగౌరరం సిఐ పి.ఎన్.డి. ప్రసాద్, సిసిఎస్ సిఐ మొగిలయ్య, శాలిగౌరారం ఎస్.ఐ. వై. హరిబాబు, శాలిగౌరారం కానిస్టేబుల్స్ జె. సత్యనారాయణ, చంద్రయ్య, నకిరేకల్ కానిస్టేబుల్స్ ప్రభాకర్, కొండల్, కట్టంగూరు కానిస్టేబుల్ జగన్, కేతేపల్లి పోలీస్ స్టేషన్ హోమ్ గార్డులు జానయ్య, శ్రీనివాస్ రెడ్డి లను డిఐజి ఏ.వి.రంగనాధ్ శాలువాతో సత్కరించి రివార్డు అందజేసి అభినందించారు. మరింత సమర్ధవంతంగా పనిచేస్తూ ప్రజా మన్ననలు పొందేలా విధి నిర్వహణ చేస్తూ తెలంగాణా పోలీసుల గౌరవాన్ని పెంచాలని డిఐజి రంగనాధ్ సూచించారు.

Related posts

అన్యాయం చేసే ఆర్డినెన్స్‌ 2ను రద్దు చేయాలి

Satyam NEWS

హిందూపూర్ 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

Bhavani

టాస్క్ ఫోర్స్ దాడులతో రాష్ట్రంలో తగ్గిన నకిలీ విత్తన విక్రయాలు

Satyam NEWS

Leave a Comment