40.2 C
Hyderabad
April 26, 2024 12: 19 PM
Slider మహబూబ్ నగర్

టాస్క్ ఫోర్స్ దాడులతో రాష్ట్రంలో తగ్గిన నకిలీ విత్తన విక్రయాలు

#gadwala police

రాష్ట్రంలో నకిలీ విత్తనాల నియంత్రణ,  విక్రయదారులపై పోలీస్, వ్యవసాయ శాఖలచే ఏర్పాటైన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు చేపడుతున్న దాడులు సత్ఫాలితాలనిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు.

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ రోజు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి  నిరంజన్ రెడ్డి, డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఐ. జి నాగిరెడ్డి  మరియు  విత్తనాభివృద్ధి సంస్థ ఎం.డి. కేశవులుతో కలసి రాష్ట్రంలోని పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లు, డిఎస్పీ, వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా పోలీస్ కార్యాలయం లో ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, డి. ఎస్పీ యదగిరి, మండల ఏ. ఒ లు , పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసు, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా చేస్తున్న కృషి ప్రశంసనీయమని  అభినందించారు.

నకిలీ విత్తన  విక్రయదారులు తెలంగాణా రాష్ట్రాన్ని చూస్తేనే భయపడే స్థితికి వచ్చారని, అయినప్పటికీ అక్కడక్కడా ఇంకా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టు తనికీల్లో బయట పడుతోందని అన్నారు. వ్యవసాయ సంబంధిత విత్తనాలు కంపెనీలకు లైసెన్స్ ల జారీ లోప్రస్తుతం ఉన్న కొన్ని లోపాలను సవరించి మరింత సరళతరంగా జారీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. కల్తీ రహిత విత్తన రాష్ట్రంగా తెలంగాణ ను రూపొందించాలని అన్నారు.

ఈ సందర్బంగా డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రేతలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 320 మందిఫై 209 కేసులు నమోదు చేసి 6511 క్వింటాల్ల నకిలీ విత్తనాలను స్వాదిన పర్చుకున్నామని వివరించారు. వీరిలో నలుగురిపై పీడీ కేసులు కూడా నమోదు చేశామని అన్నారు.

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం విత్తన బాండాగారంగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రస్తుత తనికీల్లో అమాయకులను కాకుండా  కరుడు గట్టిన కల్తీ విత్తన విక్రయదారులపైనే కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే, పోలీస్ శాఖ చేపట్టిన  చర్యల వల్ల రాష్ట్రంలో నకిలీ విత్తనాలు బెడద  గణనీయంగా తగ్గించగలిగామని అన్నారు. 

రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు సమర్థవంతం గా పనిచేస్తున్నాయని ప్రశoశించారు. ఇతర రాష్ట్రాలనుండి కల్తీ విత్తనాలను అక్రమంగా రవాణా చేసి విక్రయించే కరడు గట్టిన నేరస్తులపై  కూడా పీడి చట్టాన్ని పెట్టాలని తెలిపారు.

ఎన్ని కేసులు నమోదు చేసామన్నది ప్రధానం కాదని, ఆయా కేసుల ద్వారా ఏర్పడ్డ ప్రభావం ఎంతనేదే ప్రధానమని అన్నారు. వివిధ జిల్లాల్లో కల్తీ విత్తన నివారణపై చేపట్టిన ఈ ఎన్ఫోర్స్మెంట్ లో ఎదురైన అనుభవాలు, పరిశీలనలు, సూచనలతో కూడిన సవివర నివేదికలను పంపిస్తే, వీటి ప్రాతిపదికన రానున్న రోజుల్లో నకిలీ విత్తనాల నిరోధంపై మరింత సమర్థవంతం వ్యవహరించే అవకాశం ఉందని అన్నారు. 

న్యాయబద్ధంగా విత్తన వ్యాపారం చేసుకునే వారికి ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టం చేశారు. నిరంతరం కల్తీ విత్తన వ్యాపారానికి పాల్పడే వారిపై హిస్టరీ షీట్ లను తెరచి, సంబంధిత స్టేషన్ లకు కూడా సమాచారం అందించాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్  మాట్లాడుతూజిల్లాలో ఇప్పటివరకు  టాస్క్ ఫోర్స్ బృందాలు, పోలీస్ అధికారులు, వ్యవసాయ అధికారులతో కలసి పలు ప్రాంతాలలో తనిఖీలు చేపట్టి నకిలీ విత్తనాల కట్టడికి కృషి చేయడం జరిగిందన్నారు.

ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీమ్లు నిరంతరాయంగా తనిఖీలు చేపట్టి  దాడులు కొనసాగిస్తూ నట్లు తెలిపారు. అలాగే  జిల్లాలో  నకిలీ విత్తనాల కట్టడికి  ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, నమోదు అయిన కేసుల వివరాలు, పోలీస్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా చేపట్టిన దాడులు, టాస్క్ ఫోర్స్ బృందాల పనితీరు ను వివరించారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ శాఖ పరంగా నకిలీ విత్తనాల కట్టడికి చేపట్టిన చర్యలను వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  అన్ని మండలాల ఏ. ఓ లు, గద్వాల్ సి. ఐ జక్కుల హన్మంతు, శాంతినగర్ సి. ఐ వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనార్దన్, డీసీ ఆర్ బి ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

బీజేపీ నేతలకు కరోనా ఎక్కించేందుకు ఢిల్లీ వెళ్ళారా

Satyam NEWS

మహాశివరాత్రి మహోత్సవానికి కోటప్పకొండ సిద్ధం

Satyam NEWS

అత్యంత వాయు కాలుష్య నగరంగా ఢిల్లీ

Murali Krishna

Leave a Comment