38.2 C
Hyderabad
April 29, 2024 12: 05 PM
Slider ఆంధ్రప్రదేశ్

మూడు రాజధానులపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

y s jagan

మూడు రాజధానులపై ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ అనంతరం బీసీజీ కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ మేరకు ఆదివారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో జగన్ కెబినెట్‌లోని పలువురు మంత్రులు, ముఖ్య అధికారులు ఉన్నారు.  కమిటీ సభ్యులు వీరే: బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నాని, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు, డీజీపీ, ఛీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ, మున్సిపల్ పట్టణాభివృద్ది కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఈ హైపవర్ కమిటీకి చీఫ్ సెక్రటరీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. మూడు వారాల్లోగా కమిటీ నివేదికను ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీని ఆదేశించారు. ఇటీవలే కేబినెట్ భేటీలో ఈ మూడు రాజధానుల విషయమై నిశితంగా చర్చించి ఫైనల్‌గా కమిటీని ఏర్పాటు చేశారు.

Related posts

జగనన్న కాలనీ ఇళ్ళకి 5లక్షల రూపాయలు ఇవ్వాలి

Bhavani

మహా శివరాత్రి శుభాకాంక్షలతో సంధ్య స్టూడియోస్ “తొలి ఏకాదశి”

Satyam NEWS

అంధుల పాఠశాలకు ఆదాల వింధ్యావళి లక్ష విరాళం

Satyam NEWS

Leave a Comment