38.2 C
Hyderabad
May 2, 2024 22: 07 PM
Slider గుంటూరు

శ్రీ త్రికోటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన నరసరావుపేట ఎమ్మెల్యే

#kotappakonda

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడుకుకు మణిహరమైన శ్రీ త్రికోటేశ్వర స్వామికి శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సతీసమేతంగా స్వామివారి సన్నిధికి విచ్చేసిన కి ఆలయ ఈవో, పండితులు మేళతాళాలతో స్వాగతం పలికారు. ముందుగా ఆనందవల్లి దేవస్థానానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయల కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ త్రికోటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక  పూజలు చేశారు. అనంతరం ఉచిత లడ్డూ ప్రసాదం కేంద్రాన్ని విజ్ఞాన్ విద్యా సంస్థల అధిపతి లావు రత్తయ్య తో కలిసి ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ భక్తులు అందరూ స్వామి వారికి చాలా త్వరగా దర్శించుకుంటున్నారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున తిరునాళ్ళుకు ప్రజలు తరలి వస్తున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు సహజం అన్నారు. వాటిని కూడా సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్న మని అన్నారు. అక్కడ రంగులు వేయలేదు.. ఇక్కడ చెత్త తె

తీయలేదు అని ఆరోపించడం భావ్యం కాదన్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేశామని. ఎప్పటి వరకు ట్రాఫిక్ జామ్ అనే మాట లేదు అన్నారు. వీఐపీ లు అందరూ కూడా బస్సుల్లో పైకి వస్టే చాలా వరకు సామాన్యులకు ఇబ్బంది లేకుండా చేసిన వాళ్ళం అవుతాం అన్నారు. టిడిపి వాళ్ళు కూడా ఆరోపణలు చేయడం ఆపివేసి.. డ్యూటీలో ఉన్న సిబ్బందికి సహకరిస్తూ భక్తులకు సహకారం అందించాలి అని సూచించారు.

Related posts

మీ కుటుంబ పాలనలో ఆడపడుచులు భాగం కాదా?

Satyam NEWS

ప్రవీణ్ ప్రకాశ్ ను విధుల నుంచి తప్పించండి

Satyam NEWS

కుప్పం నుండి సైకిల్ పై రాజమండ్రికి

Bhavani

Leave a Comment