42.2 C
Hyderabad
April 30, 2024 17: 28 PM
Slider గుంటూరు

రైల్వే గేట్ల వద్ద ఇబ్బందులు తొలగించండి

#nitingadkari

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు రైల్వే గేట్ల వద్ద ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా అత్యవసరంగా ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు మంజూరు చేసి త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని పల్నాడు జిల్లా  నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ కి వినతిపత్రం సమర్పించారు.

1.నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గంలో సత్తెనపల్లి నుండి మాదిపాడు వెళ్లే మార్గంలో ఎల్‌సీ నెం. 40 వద్ద

2. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో గుంటూరు నల్లపాడు మధ్యలో ఉన్న ఎల్‌సీ నెం. 497ఏ వద్ద ఆర్‌ఓబీలు అత్యవసరంగా నిర్మించాల్సి ఉందని మంత్రి కి విన్నవించారు.

ముఖ్యంగా గుంటూరు-నల్లపాడు గేట్ వద్ద సమస్య జటిలంగా ఉందని దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఎంతో అసౌకర్యానికి, గురవుతున్నారని పేర్కొన్నారు. సమస్యల్ని పరిష్కరించాలని కోరారు.

కేంద్రం ఆంధ్రరాష్ట్రానికి ప్రతిపాదించిన 38 ఆర్‌ఓబీలు,  ఆర్‌యూబీల పనుల జాబితాలో, మొదటి దశ జాబితాలో సీరియల్‌ నెంబర్‌ 25,26 నంబర్లు చేర్చబడ్డాయని.. అన్ని లెవల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్ద ఆర్‌యూబీ, ఆర్‌ఓబీల నిర్మాణం చేపట్టాలని కోరారు.

Related posts

మూడు రాజధానులతో ముగ్గురికీ చెక్

Satyam NEWS

భరత్ తో అసత్యాలు చెప్పిస్తున్నదెవరు?

Satyam NEWS

ఛాలెంజ్:ఈప్రభుత్వాన్ని కూల్చేంతవరకు నిద్రపోను

Satyam NEWS

Leave a Comment