38.2 C
Hyderabad
April 29, 2024 20: 54 PM
Slider విజయనగరం

రాత్రి సమయంలో బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్

#collector

గడచిన రెండు రోజులు గా…విజయనగరం జిల్లా లో కొత్తవలస లో బాలికల వసతి గృహంలో బాలికల ఆరోగ్యం పై విభిన్న మైన వదంతులు వచ్చిన వేళ…కలెక్టర్ ఆదేశాలతో స్వయంగా కొత్త వలస హాస్టల్ ను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సందర్శించడంతో మరింత హైప్ పెరిగింది. సీన్ కట్ చేస్తే…

కొత్తవలస హాస్టల్ ని ఆకస్మికంగా కొద్ది సేపటి క్రితమే అంటే ఈ రాత్రి 09.15 కు సందర్శించారు… జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి., కొత్తవలస బిసి బాలికల వసతి గృహానికి కలెక్టర్ వెళ్లి.. హాస్టల్ లో బాలికలతో మాట్లాడి, అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఒక్క రోజు ముందే అస్వస్థతకు గురి అయి చికిత్స పొందిన బాలికలతో మాట్లాడారు. వారి అగోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. వారి సమస్యలపై ప్రశ్నించారు. బాగా చదువుకోవాలని కోరారు. ఈ పర్యటనలో జిల్లా బిసి సంక్షేమాధికారి యశోదనరావు పాల్గొన్నారు.

Related posts

అసలు ఉత్తరాంధ్ర కు వైఎస్సార్సీపీ ఏం చేసింది?

Satyam NEWS

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

వైకాపా ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది

Satyam NEWS

Leave a Comment