40.2 C
Hyderabad
April 28, 2024 15: 09 PM
Slider ముఖ్యంశాలు

గ్రేట్: రతన్ టాటాకు పాదాభివందనం చేసిన నారాయణమూర్తి

ratan tata

అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ లాగా ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు. నిజంగా ఇది అక్షరాలా చేసి చూపించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపక చైర్మన్ నారాయణమూర్తి తాను గొప్పోడినని మరొక్కమారు నిరూపించారు. నేడు ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో రతన్ టాటాకు టైకాన్ అవార్డు బహూకరించాల్సి వచ్చింది. దానికి ముఖ్య అతిధిగా నారాయణమూర్తిని పిలిచారు.

ఆయన ఈ అవార్డును రతన్ టాటాకు ఇచ్చిన తర్వాత ఆయనకు పాదాభివందనం చేశారు. దాంతో రతన్ టాటా చలించిపోయారు. గొప్ప స్నేహితుడు నారాయణమూర్తి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమని రతన్ టాటా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. అంతే కాదు తన గొప్ప స్నేహితుడి వీడియోను కూడా ఆయన ట్యాగ్ చేశారు. నారాయణమూర్తి గొప్పతనం, రతన్ టాటా వ్యాఖ్యానం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related posts

ఓటరును చైతన్య పరిచే ధైర్యం పార్టీలకు ఎందుకు లేదు..?

Satyam NEWS

పోలీసు స్పందనలో బాధితుల గోడు…

Satyam NEWS

హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ 2023 జెర్సీ విడుదల

Satyam NEWS

Leave a Comment