37.2 C
Hyderabad
May 1, 2024 12: 19 PM
Slider నిజామాబాద్

నరేంద్ర మోడీ ధర్మ పాలన ప్రపంచానికే ఆదర్శం

#Yendela Laxminarayana BJP

రెండవ సారి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ప్రధాని మోడీ పాలన ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక సంవత్సర కాలంలో ప్రధాని మోడీ చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. దేశంలో అంతర్భాగం అయిన కాశ్మీర్ 70 సంవత్సరాల పాలనలో ప్రత్యేక రాజ్యంగంతో పాలన కొనసాగించిందన్నారు.

ఓటు బ్యాంకు రాజకీయాలకు అడ్డుకట్ట 

తాత్కాలికంగా తెచ్చినట్టు చెప్పి 370 ఆర్టికల్, 35(ఏ)ను కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలుగా అమలులో ఉంచిందని ఆయన అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో చట్టాన్ని కొనసాగించారని,  చట్టాన్ని తొలగించే సాహసం చేయలేదని విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చాక 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ ను భారత్ లో కలిపారని తెలిపారు. ఒక్క భారత దేశంలో తప్ప 22 ఇస్లామిక్ దేశాల్లో ఎక్కడ త్రిబుల్ తలాక్ అమలు లేదన్నారు.

ట్రిపుల్ తలాక్ విధానాన్ని ఎత్తివేసి మైనారిటీ మహిళలకు తోబుట్టువుగా అండగా నిలబడ్డారని చెప్పారు. 500 సంవత్సరాలుగా వివాదంలో ఉన్న రామ మందిర నిర్మాణానికి కోర్టులు నిర్ణయం తీసుకునేలా అనువైన వాతావరణం కల్పించారని వెల్లడించారు.

పౌరసత్వ సవరణ చట్టంతో దేశానికి మేలు

వివిధ దేశాల్లో మతపరమైన దాడులకు గురైన వారికి పౌరసత్వ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో ఆశ్రయం పొందేలా చేశారని తెలిపారు. పౌరసత్వ చట్టం ద్వారా భారత ప్రజల నుంచి మోడీకి నీరాజనాలు వెల్లువెత్తాయని చెప్పారు. కరోనా వైరస్ ప్రభావాన్ని ముందుగా పసిగట్టి ముందస్తు లాక్ డౌన్ విధించి ప్రజలకు అవసరమైన వసతులు కల్పించారని తెలిపారు.

దేశంలోని 20 కోట్ల డ్వాక్రా సభ్యులకు 5 వందల రూపాయల చొప్పున 30 వేల కోట్లు అందించారని, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ద్వారా 3 నెలల పాటు ఉచితంగా సిలిండర్ అందజేశారని తెలిపారు. రైతులకు రైతుబంధు నిధులను వారి ఖాతాల్లో జమచేశారని పేర్కొన్నారు.

20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అనితర సాధ్యం

80 కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో పప్పు అందజేశారని, 15 వేల కోట్ల కరోనా నిధిని రాష్ట్రాలకు కేటాయించారని వివరించారు. రైల్వే డబ్బాలను ఐసియులుగా మార్చి చికిత్సలు అందేలా చేశారని చెప్పారు. ఆత్మ నిర్బర్ భారత్ ద్వారా 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించి అభివృధ్ధికి బాటలు వేశారని చెప్పారు.

కరోనా వైరస్ వల్ల చైనాపై దేశ ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తే దేశం పట్ల అనుకూలత పొందేలా చేశారని తెలిపారు. చైనా నుంచి తరలి వెళ్తున్న పరిశ్రమలకు భారతదేశం అనువైన వాతావరణం కల్పించిందని చెప్పారు. 11 వ తేదీ నుంచి 25 వరకు సంవత్సర పాలనపై బీజేపీ చేపట్టిన పనులను ప్రజలకు వివరించేలా కార్యకర్తలు జట్లుగా ఏర్పడి వర్చువల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

రాజకీయంగా వత్తిడులకు గురిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ

అధికార టిఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీ నాయకులను ఒత్తిళ్లకు గురి చేస్తూ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులను బెదిరించడానికి ప్రజలు అధికారం కట్టబెట్టలేదని, ప్రజలు తిరగబడి ఎదురిస్తారన్నారు. తాము కూడా వదిలిపెట్టమని, మిమ్మల్ని రచ్చకీడుస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సబ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Related posts

దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు వేతనాలు పెంపు

Satyam NEWS

కమ్యూనల్: తెలంగాణ పోలీసులుపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు

Satyam NEWS

చీఫ్ జస్టిస్ గా అరవింద్ బాబ్రే ప్రమాణ స్వీకారం

Satyam NEWS

Leave a Comment