28.7 C
Hyderabad
April 27, 2024 04: 32 AM
Slider ఆంధ్రప్రదేశ్

ముంపు ప్రాంతాలకు పునరావాస కేంద్రాలు

pjimage (12)

పశ్చిమ గోదావరి జిల్లా వరద ముంపు ప్రభావిత లంక  గ్రామాలలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ చర్యలు చేపడుతుందని నర్సాపురం పార్లమెంట్  సభ్యులు రఘురామకృష్టం రాజు  హామీ ఇచ్చారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథరాజు తో కలిసి ఆయన నేడు ముంపు ప్రాంతాలలో పర్యటించారు. ఆచంట నియోజకవర్గంలో  వశిష్ఠ గోదావరి పరీవాహక  లంక గ్రామాలైన పెద్దమలం లంక , పుచ్చల లంక,రవి లంక, మార్రిముల ,అయోద్యలంక గ్రామాల్లో  పర్యటించి అక్కడున్నా ఇబ్బందులను,పరిస్థితులను  ప్రజలను అడిగి వారు తెలుసుకున్నా రు. వరద ఉధృతి పెరిగితే లంక గ్రామ  ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వారు అధికారులను ఆదేశించారు. మంత్రి, ఎంపిలతో బాటు మాజీ ఎమ్మెల్సీ మేక శేషు బాబు, నర్సాపురం సబ్ కలెక్టర్ సలీమ్ ఖాన్ తదితరులు ఉన్నారు.

Related posts

మాచర్ల ఘటన భయానకం: నవతరంపార్టీ

Bhavani

అనాధ పిల్లలను ఆదుకుంటాం: బాలల సంక్షేమ సమితి

Satyam NEWS

బి.ఆర్.కె.ఆర్ భవన్ లో Constitution Day

Satyam NEWS

Leave a Comment