30.2 C
Hyderabad
September 14, 2024 16: 09 PM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

Srisailam reservoier

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిపోయింది. జలాశయానికి పూర్తి స్థాయి రావడంతో శుక్రవారం సాయంత్రం నాలుగు గేట్లను ఎత్తారు. ఈ సందర్భంగా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, తెలంగాణ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ కృష్ణమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి అనిల్‌కుమార్‌ నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్‌వైపు పరుగులు పెడుతోంది. ఈ నాలుగు గేట్ల ద్వారా దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తొలుత 6వ నెంబర్‌ గేటను ఎత్తారు. ఆ తర్వాత 7, 8, 9 ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ఒక్కో గేటు నుంచి 25వేల క్యూసెక్కుల చొప్పున అధికారులు నీటిని విడుదల చేశారు.  ఎగువన భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువైంది. మొత్తం నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 880 అడుగులు దాటింది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 189.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Related posts

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం విజయవంతం చేయండి

Satyam NEWS

వాంటెడ్ జస్టిస్:రఘునందన్ రావు లైంగికదాడి చేసాడు

Satyam NEWS

యూపీ ఎన్నికల్లో మరోసారి కమల వికాసం

Sub Editor

Leave a Comment