37.2 C
Hyderabad
May 2, 2024 11: 51 AM
Slider విశాఖపట్నం

నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు అరెస్టు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని ఆయన పై పోలీసులు అభియోగాలు మోపారు. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడలు దూకి లోనికి ప్రవేశించిన పోలీసులు ఆయన ను అరెస్టు చేశారు. అదేవిధంగా ఆయన కుమారుడు చింతకాయల రాజేశ్‌ను కూడా సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరుపరుస్తామని సీఐడీ పోలీసులు తెలిపారు. అయ్యన్నపాత్రుడిపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కేసులు నమోదు చేశారు.

అర్ధరాత్రి అయ్యన్నఇంట్లోకి పోలీసుల ప్రవేశంపై స్థానికులు కుటుంబసభ్యులు ప్రతిఘటించారు. స్థానికుల నుండి పోలీసులు ఫోన్లు తీసుకున్నారు. తన భర్త, కుమారుడికి ప్రాణహాని ఉందని అయ్యన్న భార్య పద్మావతి అన్నారు. ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసిన అయ్యన్న సతీమణి పద్మావతి అన్నారు. కనీసం దుస్తులు మార్చుకొనివ్వకుండా తన భర్తను తోసుకుంటూ తీసుకువెళ్లారని పద్మావతి అన్నారు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకొనివ్వకుండా తన భర్తను తోసుకుంటూ వెళ్లారని పద్మావతి అన్నారు. జగన్ రెడ్డి 3 ఏళ్లుగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

గర్భంలో ఉన్న ఆడపిల్లలను చిదిమేస్తున్న కిలాడీ ముఠా

Satyam NEWS

15 నుండి 18 సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులందరికీ వ్యాక్సిన్ తప్పనిసరి

Satyam NEWS

డిప్యూటీ సీఎం రాకతో వార్తలకెక్కిన విజయనగరం జిల్లా కేంద్ర వైద్యశాల

Satyam NEWS

Leave a Comment