37.2 C
Hyderabad
May 1, 2024 13: 44 PM
Slider వరంగల్

ములుగు జిల్లాలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

#mulugudistrict

ములుగు జిల్లా బరిగలపల్లి ప్రాథమిక పాఠశాల లో నేడు జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్త పల్లి పోషన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కాయిత రమేష్, స్థానిక సర్పంచ్ గరిగ లత నర్సింగరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను ఉపయోగించి విషయాల వారీగా ప్రాజెక్టు లు రూపొందించారు. మట్టి బొమ్మలు, ఇండ్ల తయారి, చార్ట్ ల లో ప్రయోగాలు, మొక్కలు పెరిగే విధానాలు తయారు చేసి, అవి ఎలా తయారు చేస్తారు, ఏవిధంగా పని చేస్తాయి అని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తయారు చేసిన ఈ ప్రయోగాలు చూసి సర్పంచ్, చైర్మన్ వారి కళా నైపుణ్యాలను మెచ్చుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇలాంటి ప్రయోగాలు, బొమ్మల తయారీ వల్ల విద్యార్థుల లో దాగిన కళా నైపుణ్యాలు పెంపొందుతాయని అన్నారు. అదేవిధంగా వారికి భయం పోయి ధైర్యం అలవడుతుంది, విషయ పరిజ్ఞానం కూడా పెరుగుతుంది అన్నారు. చక్కటి నైపుణ్యం ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది.

Related posts

ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ హెల్మెట్ ధరించాలి

Satyam NEWS

Good News: కరోనా వ్యాక్సిన్ డోసు వెయ్యి రూపాయలు

Satyam NEWS

ఆసరా పింఛన్‌ దరఖాస్తులకు రుసుం వసూలు చేయవద్దు

Satyam NEWS

Leave a Comment