గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మరణించింది. నల్లగొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా కేశరాజుపల్లి శివారులో ఆమె ప్రయాణిస్తున్న కారు ను ఒక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో షాహేదా అక్కడికక్కడే మరణించింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో షాహేదానే డ్రైవ్ చేస్తున్నట్టు సమాచారం.
షాహేదా మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌కు చెందిన బెస్త కిష్టయ్య, జోడు ఆంజనేయులు జంట హత్య కేసుల్లో సాజిద్ నిందితురాలిగా ఉంది. నయీమ్ చేసిన పలు హత్య కేసులు,దందాల్లోనూ ఆమె విచారణ ఎదుర్కొంటోంది. నయీమ్ కేసుల్లో నిందితుడు అయిన ఫహీంకు షాహేదా భార్య.