29.7 C
Hyderabad
April 29, 2024 07: 29 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఫైనల్ జోల్ట్: రాజధాని మార్పుపై ప్రధానికి నివేదిక

PM Jagan

ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రధాని నివాసంలో దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి నివేదించారు. ఈ మేరకు లేఖ అందించారు. అదే విధంగా ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధానిని ఆయన కోరారు.

ప్రధాన మంత్రికి సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు: తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్థలాల పంపిణీకోసం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. 2.2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా సహాయ, పునరావాస పనులకు రూ.33010 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని, పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.3320 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని 15వ ఆర్ధిక సంఘం చెప్పిన విషయాన్ని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందని చెప్పారు.

ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించగలరంటూ సిఎం కోరారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ యేడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువేనని పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలని కోరారు. కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని కోరారు. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే… కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులునూ వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరారు.

వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు గడిచిన ఆరేళ్లలో 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు  మాత్రమే ఇచ్చారని, గడిచిన మూడేళ్ల నుంచి  కేటాయింపులు కూడా లేవని, రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలని కోరారు. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని ప్రధానికి వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతిగా ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. శాసనమండలి రద్దు తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

Related posts

అంబర్ పేట్ నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధికి చర్యలు

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ లో మీడియాపై దారుణమైన ఆంక్షలు

Satyam NEWS

మూసీ అంచును మూసేస్తున్న కబ్జాదారులు

Satyam NEWS

Leave a Comment