38.2 C
Hyderabad
April 29, 2024 12: 43 PM
Slider ముఖ్యంశాలు

సమాజానికి మార్గనిర్ధేశం చేసే బాధ్యత మీడియాదే

#digital

కీర్తి మీడియా హౌజ్, విశాలభారతి, నెట్జ్ డిజిటల్ మీడియా కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం తార్నాకలోని మెహతాబ్ ఆర్కెడ్‌లో జరిగిన కీర్తి మీడియా హౌజ్, నెట్జ్ డిజిటల్ మీడియా కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా గుమ్మి రాంరెడ్డితోపాటు క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, వాసవి గ్రూప్ సీఎండీ యెర్రం విజయ్ కుమార్‌తోపాటు పలువురు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి మాట్లాడుతూ… అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో పుట్టగొడుగుల్లా మీడియా సంస్థలు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో… విలువలతో కూడిన బాధ్యతయుతమైన మీడియా వ్యవస్థలే సమాజానికి ఎంతో ముఖ్యమన్నారు. మంచి వ్యక్తిత్వంతో కూడిన వ్యవస్థలను నిర్వహించినప్పుడే పది కాలాల పాటు ప్రయాణం చేయగలుగుతాయని, విలువలతో కూడిన వృత్తి విధానమే నిజమైన విజయానికి ప్రతీక అవుతుందని క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి అన్నారు.

సమిష్టిగా పనిచేసిన వ్యవస్థలే రాణిస్తాయని, వ్యక్తిగా చేయలేని ఎన్నో కార్యాలను వ్యక్తులను కలుపుకొని చేధించవచ్చని, సుదూర లక్ష్యాలనైనా సునాయాసంగా చేరుకోగలమని అన్నారు. ముఖ్యంగా భాగస్వామంతో సాగే వ్యవస్థల్లో ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత గుర్తింపులకు తావులేకుండా పనిపై దృష్టిసారిస్తే బలమైన వ్యవస్థలను నెలకొల్పవచ్చన్నారు. బ్రహ్మశ్రీ రవికృష్ణ శర్మ, ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు, రీడ్ ఇండియా గ్రూప్ ఆఫ్ లైబ్రరీస్ ఎండీ రాంమోహన్, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి, పొలిటికల్ కన్సల్టెంట్ మంద భీంరెడ్డి హాజరైయ్యారు.

పలువురు మాట్లాడుతూ సమాజాన్ని సంఘటితం చేయడంతోపాటు, సానుకూల ఆలోచన ధోరణిలను పెంపొందించడంలో మీడియా ముఖ్య పాత్రను పోషిస్తుందని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి అన్నారు. అలాంటి భావాలతోనే కీర్తీ మీడియా హౌజ్ రాణించాలని కోరుకున్నారు. కీర్తీ మీడియా హౌజ్ కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపారు.

వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూనే 10మందికి ఉపాధినిచ్చేలా గౌరవప్రదమైన వ్యవస్థగా ఎదగాలని వాసవి గ్రూప్ సీఎండీ యెర్రం విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మాశ్రీ బమిడిపాటి రవికృష్ణ శర్మ మాట్లాడుతూ…. సమాజానికి వ్యవస్థలకు మధ్య వారధిగా నిలిచి, అధర్మాన్ని ఎదురించేందుకు అవసరమైన రామబాణం లాంటి పాత్రను మీడియా రంగం పోషిస్తుందన్నారు. కఠోర శ్రమ, నలుగురికి సాయం అందించాలనే ఆలోచనతో, వేదికపై ఉన్న ముఖ్య అతిథులను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు కీర్తీ మీడియా హౌజ్, నెట్జ్ డిజిటల్ మీడియా కూడా చేరుకోవాలని కాంక్షించారు.

ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినట్లుగా మీడియా రంగంలో వేర్వేరు విభాగాల్లో పనిచేసినా… నలుగురికి మంచి చేయాలని అశోక్, శ్రీధర్‌లకు ఉన్న విలక్షణమైన వ్యక్తిత్వమే ఇరువురిని సుదీర్ఘ కాలం పాటు పని చేస్తూనే, ఒకే వేదిక నుంచి మీడియా రంగంలో నిలబడేలా చేసిందని సీనియర్ జర్నలిస్టు, సత్యంన్యూస్.నెట్ చీఫ్ ఎడిటర్ సత్యమూర్తి అన్నారు. పొలిటికల్ కన్సల్టెంట్ మంద భీం రెడ్డి మాట్లాడుతూ… సమాజాన్ని ప్రభావితం చేయడంలో మీడియా ముఖ్యమైన భూమికను పోషిస్తుందన్నారు.

సందడి చేసిన జార్జిరెడ్డి మూవీ టీం…

అట్టహాసంగా సాగిన కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభోత్సవ వేడుకల్లో జార్జిరెడ్డి మూవీ ఫేం సందీప్ మాధవ్, డైరెక్టర్ జీవన్ రెడ్డి సందడి చేశారు. ఈ సందర్భంగా నటుడు సందీప్ మాధవ్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న డిజిటల్ మీడియా యుగం నడుస్తుందన్నారు. ఎన్నో వ్యవస్థలు మీడియా పేరిట పిచ్చికూతలు, అనవసరపు వాదనలతో మీడియా వ్యవస్థలుగా చెలామణి అవుతున్నాయని, ఇలాంటి అనారోగ్యకరమైన పోటీ మీడియా వ్యవస్థలో ఉన్న నేపథ్యంలో.. సమాజానికి మంచి చేయాలనే ఉన్నత భావాలతో విశాలభారతిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ఎడిటర్ గడ్డం శ్యాంతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. జార్జి రెడ్డి మూవీ సందర్భంగా మొదలైన తమ బంధం ఇప్పటికీ కొనసాగుతుందని, ఒక వర్గానికో, ఓ పార్టీ రంగును పోసుకోకుండా నిశ్చల స్థితిలో ఉంటూనే నిక్కచ్చిగా నిజాలను సమాజానికి అందించాలన్నారు. డైరెక్టర్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీతో సంబంధం లేకుండా మంచి ఉన్నత భావాలను సమాజానికి అందించాలనే లక్ష్యాలతో ఒకే వేదికపైకి వచ్చి కీర్తీ మీడియా హౌజ్ సంస్థను ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. గడ్డం శ్యాంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నా డైరెక్టర్ జీవన్ రెడ్డి ఆనతి కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు.

ప్రోత్సాహంతోనే ఉన్నత లక్ష్యాలకు… 

తాము చేపట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు సహకరించి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులందరికీ కీర్తీ మీడియా హౌజ్ మేనేజింగ్ డైరెక్టర్ పగిళ్ల రజినీ, విశాల భారతి ఈ-డైలీ ఎడిటర్ గడ్డం శ్యాం, నెట్జ్ డిజిటల్ మీడియా ఫౌండర్ యాలాల శ్రీధర్, చీఫ్ కో ఆర్డినేటర్ మాదారపు అశోక్ అభినందనలు తెలిపారు. కార్యాలయ ప్రారంభం విజయవంతం చేయడంలో అతిథుల సహకారం, ఆశీర్వాచనలే కీలకమన్నారు. వెన్నుతట్టిన ప్రోత్సహంతోనే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలగమని, మీరిచ్చిన సలహాలు మంచి వ్యవస్థలను తీర్చిదిద్దేందుకు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయని అన్నారు.

Related posts

పరిశోధన విద్యార్ధినికి డాక్టరేట్

Sub Editor

వైసీపీ అరాచకాలపై పల్నాడు గ్రామాలలో పోలీసుల ప్రేక్షక పాత్ర

Satyam NEWS

కొమురవెళ్లి మల్లన్న గుట్ట అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Satyam NEWS

Leave a Comment