32.7 C
Hyderabad
April 27, 2024 01: 01 AM
Slider కృష్ణ

రైతులకు మేలు చేసే నూతన వ్యవసాయ చట్టం

#BJPVijayawada

రైతుల సంక్షేమం కోసం ప్రధాని మోడీ విప్లవాత్మకమైన  వ్యవసాయ బిల్లును తెచ్చారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు అన్నారు.

విజయవాడ బిజెపి కార్యాలయంలో ఆయన నూతన వ్యవసాయ చట్టంపై సమాచార పత్రాన్ని ఆవిష్కరించారు.

ఈనెల ఏడో తేదీన విజయవాడ లో రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరై రైతులకు వాస్తవాలు వివరిస్తారని ఆయన తెలిపారు.

మార్కెట్ యార్డులు ఉంచుతూనే రైతులు తమ సరకు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఈ చట్టం ద్వారా వచ్చిందని ఆయన అన్నారు.

కాంగ్రెస్, వామపక్ష పార్టీలు మార్కెట్ యార్డ్ లు మూతపడతాయని అబద్దాలు చెబుతున్నారని ఆయన తెలిపారు. దీని పై విపక్షాలు కుట్ర పూరితంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని సూర్యనారాయణ రాజు అన్నారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు, రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజి ,వంగవీటి నరేంద్ర,మీడియా కన్వీనర్ వుల్లూరి గంగధర్ పాల్గొన్నారు.

Related posts

సకాలంలో  ధృవపత్రాలు అందించాలి

Murali Krishna

ఎమ్మెల్యే బొల్లా నుండి నాకు ప్రాణహాని ఉంది ..

Satyam NEWS

గుంటూరులో కనకదుర్గమ్మ దేవాలయం కూల్చివేత

Satyam NEWS

Leave a Comment