26.7 C
Hyderabad
April 27, 2024 08: 21 AM
Slider ప్రపంచం

ఇన్ వెన్షన్: కరోనా రోగులకు కొత్త ట్రీట్ మెంట్ వచ్చేస్తున్నది

#Turkey Beam Treatment

కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు టర్కీ ఒక నూతన చికిత్సా విధానాన్ని కనిపెట్టింది. ప్రయోగాత్మకంగా చేసిన ఈ చికిత్స మంచి ఫలితాలను సాధించిందని టర్కీ వైద్యులు వెల్లడించారు. దీన్ని టర్కీ రే థెరపీ మెథడ్ (టర్కిష్ బీమ్) అని టారు. 46 ఏళ్ల ఒక కరోనా పాజిటీవ్ వ్యక్తిపై ఈ చికిత్స నిర్వహించారు.

ఈ చికిత్సకు అద్భుత ఫలితాలు వచ్చాయని అంకారాస్ గాజీ యూనివర్సిటీ కార్డియో వ్యాస్య్కులార్ సర్జన్ హైక్మెత్ సెల్కూక్ గెడిక్ తెలిపారు. కరోనా చికిత్స కు ఇప్పటికే చాలా రకాల చికిత్సలు ఉన్నాయని అయితే ఈ విధానం ప్రపంచంలోనే తొలిసారిగా తాము చేపట్టామని గెడిక్ తెలిపారు. తీవ్రమైన కరోనా వైరస్ తో ఉన్న ఆ రోగి తమ చికిత్సతో బాగా కోలుకున్నాడని ఆయన అన్నారు.

ఈ చికిత్సను తీసుకున్న మెహమూత్ ఓరక్ మాట్లాడుతూ తాను జూన్ 18న ఆసుపత్రికి వచ్చానని, తనకు పాజిటీవ్ వచ్చిన తర్వాత చికిత్స ప్రారంభించారని తెలిపాడు. ఐదు రోజుల అనంతరం తన పరిస్థితి మరింత దిగజారడంతో ఈ చికిత్సకు అంగీకరించినట్లు అతను తెలిపాడు. తనకు ఈ చికిత్స సమయంలో ఎలాంటి నొప్పి కూడా కలుగలేదని అన్నాడు.

వైరస్ ట్రీట్ మెంట్ చేయడానికి తాము చాలా కాలంగా ఈ విధానంపై ప్రయోగాలు చేస్తున్నామని, ప్రయోగాత్మకంగా కోవిడ్ 19 పై దీన్ని ప్రయోగించగా క్లీనికల్ ట్రయల్స్ లో ఎంతో మంచి ఫలితాలు వచ్చాయని టర్కీ శాస్త్రవేత్తలు తెలిపారు. మూడు సంవత్సరాల కిందట టర్కిష్ బీమ్ సెలెక్టీవ్ సెన్సిటీవ్ యువిసి, లేజర్ థెరపీని అభివృద్ధి పరచామని వారు తెలిపారు.

టర్కిష్ బీమ్ ట్రీట్ మెంట్ వల్ల శరీరంలోని హానికారక వైరస్ పూర్తిగా నాశనం అవుతుందని అన్నారు. శరీరంలోని మంచి కణజాలంగానీ, అవసరమైన బ్యాక్టీరియా, వైరస్ లను గానీ ఈ టర్కీ బీమ్ ఏమీ చేయదని వారు తెలిపారు. ప్రపంచం వైద్య విధానంలో ఇది సంచలనం సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వైద్య నిపుణులు కూడా ఈ విధానాన్ని ఆమోదించారని వారు వెల్లడించారు.

Related posts

కాంగ్రెస్ బలాన్ని చాటి చెప్పిన భట్టి రైతు యాత్ర

Satyam NEWS

కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలంతా మద్దతు ఇవ్వాల్సిన సమయం

Satyam NEWS

హోలీ సంబరాల్లో కలెక్టర్

Murali Krishna

Leave a Comment