38.2 C
Hyderabad
May 1, 2024 19: 34 PM
Slider గుంటూరు

పల్నాడు జిల్లాలో రెడ్డి కులస్తుల మధ్య పెరిగిన అగాథం

#gopireddysrinivasareddy

వర్గ పోరుతో అధికార వైసీపీ పల్నాడు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారనే వార్తలు ఇక్కడ గుప్పుమంటున్నాయి. శ్రీనివాస్ రెడ్డికి మళ్లీ నరసరావుపేట అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తే ఓడించి తీరుతామని వైసీపీ రెడ్డి సామాజిక వర్గ నాయకులు అధిష్టానానికి లేఖలు రాసినట్లు కూడా చెబుతున్నారు.

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండుసార్లు నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేసిన చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేయలేదని సొంత పార్టీ వారే విమర్శిస్తున్నారు. అందులోనూ అతి బలంగా ఉండే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఈ వ్యాఖ్యలు చేస్తుండటం అధికార వైసీపీలో గుబులు రేపుతున్నది. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన అడ్డగోలుగా సంపాదించుకున్నారని, నరసరావుపేటలో జి టాక్స్ వసూలు చేస్తూ….పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని నరసరావుపేట రెడ్డి సామాజిక వర్గ నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర వాపోయారని విశ్వసనీయంగా తెలిసింది.

వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికి ఇతర పార్టీలోని ఓ సామాజికవర్గ నాయకులతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని కూడా వారు అంటున్నారు. గతంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారని కూడా వారు గుర్తు చేస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారని అధిష్టానానికి నరసరావుపేట వైసీపీ ముఖ్య నాయకులు లేఖల ద్వారా వివరించారనే పుకార్లు వ్యాపించాయి.

గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బినామీ పేర్లతో కాంట్రాక్టులు,అనుచరులతో సొంత పార్టీ నాయకుల దగ్గర సైతం వసూళ్లకు పాల్పడుతున్నారని అధిష్టానానికి ఆధారాలు సమర్పించారని కూడా అంటున్నారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విధానాలను మార్చుకోమని చెప్పిన సొంత పార్టీ కార్యకర్తలను పోలీస్ కేసులు పెట్టి వేధించారని నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు గోపిరెడ్డి పై గుర్రుగా ఉన్నారని కూడా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పల్నాడు జిల్లాలోని ప్రస్తుతం మరో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ఎమ్మెల్యేకి టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారని కూడా తెలిసింది. గోపి రెడ్డికి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని అధిష్టానానికి తెగేసి చెప్పారని కూడా సంబంధిత వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. ప్రశాంత కిషోర్ సర్వేల్లోనూ ఇదే రిపోర్ట్ రావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి 2024 ఎన్నికల్లో నరసరావుపేట కేటాయించలేము అని తెగేసి చెప్పారనే పుకార్లు విస్తృతంగా వినిపిస్తున్నాయి.

Related posts

సమైక్య పాలనలో దుర్భిక్షం.. స్వపరిపాలనలో సుభిక్షం

Bhavani

హసన్ పర్తి రోడ్డు ప్రమాదంలో పత్రికావిలేకరి మృతి

Satyam NEWS

నన్ను అణగదొక్కాలని ఈ ప్రభుత్వం చూస్తోంది: అశోక్ గజపతిరాజు

Satyam NEWS

Leave a Comment