శ్రీకాకుళం జిల్లా క్రీడా రంగంలో మరో ఆణిముత్యం మెరిచింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శెనగల ఝాన్సీ రాణి వెయిట్ లిఫ్టింగ్ లో తనదైన శైలిలో పతకాలు సాధిస్తున్నది.
ఈ నెలలో కడప జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు యాభై ఐదు కేజీల విభాగంలో ఈమెకు కాంస్య పతకం వచ్చింది. ఈ విద్యార్థిని ఇప్పటికే అనేక పోటీల్లో పతకాలు సాధించింది. రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల పాఠశాలల ఆటలు పోటీలలో ఈ పతాకం సాధించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మక్కా శ్రీనివాసరావు విద్యార్థినికి అభినందనలు తెలిపారు.
అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు గుండా బాల మోహన్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈమె సాధించిన విజయం పట్ల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎం శాంతారావు, ఎస్ వి కృష్ణారావు, జి భూషన్ రావు, కే సురేష్ కుమార్, డి ఎం మల్లేశ్వరి, ఆర్ట్, సిహెచ్ రవి కుమార్, క్రాఫ్ట్, బి త్రివేణి, అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు ఈమెకు అభినందించారు.